ప్రణబ్‌ను కలిసిన విజయమ్మ: జగన్, సిబిఐ దర్యాఫ్తేనా

వీరు మధ్యాహ్నం సమయంలో ప్రణబ్ ముఖర్జీని కలిశారు. మర్యాదపూర్వకంగానే విజయమ్మ కలిసినట్లుగా చెబుతున్నారు. మూడు నెలల క్రితం జరిగిన రాష్ట్రపతి ఎన్నికల అనంతరం ప్రణబ్ ముఖర్జీని కలవలేదని, అందుకే గౌరవ పూర్వకంగా మాత్రమే కలిశారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు చెబుతున్నారు.
సిబిఐ దూకుడు నేపథ్యంలో...
తాము మర్యాద పూర్వకంగానే కలిశామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు చెబుతున్నప్పటికీ ప్రణబ్ ముఖర్జీతో భేటీలో విజయమ్మ తన తనయుడు, పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ అంశం, సిబిఐ దర్యాఫ్తు అంశాలపై ప్రణబ్‌తో చర్చించినట్లుగా పలువురు అభిప్రాయపడుతున్నారు.
మూడు రోజుల క్రితం సుప్రీం కోర్టు జగన్ బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చిన విషయం తెలిసిందే. అంతేకాకుండా మరో ఐదారు నెలలు జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో జగన్ జైలులోనే ఉంటే పార్టీకి కష్టమని భావించిన విజయమ్మ రాష్ట్రపతితో భేటీ అయి జగన్ బెయిల్ పిటిషన్ అంశంపై చర్చించి ఉంటారని చెబుతున్నారు. మూడు రోజుల క్రితం జగన్ బెయిల్ పిటిషన్ పైన విచారణ జరుగుతున్న సమయంలో కూడా సిబిఐ జగన్ ఇల్లు, కార్యాలయాల్లో హఠాత్తుగా సోదాలు కూడా నిర్వహించింది.












Click it and Unblock the Notifications