ఒకరు మాటల మరాఠీ, మరొకరు...: చంద్రబాబు

Chandrababu Naidu
అనంతపురం: అనంతపురం జిల్లాలోని ఇద్దరు మంత్రులలో ఒకరు మాటల మరాఠీ కాగా, మరొకరు మాయల మరాఠీ అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఘాటుగా విమర్శించారు. మంత్రులు రఘువీరా రెడ్డి, శైలజానాథ్‌ను ఉద్దేశించి ఆయన ఆ వ్యాఖ్య చేశారు. వస్తున్నా...మీకోసం కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం జిల్లాలోని నందకుర్లపల్లి నుంచి ఏడో రోజు పాదయాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు.

కాంగ్రెస్ చేతకాని తనం వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు. మంత్రుల నియోజకవర్గాల్లోనే ఈ విధంగా ఉంటే ఇక అన్ని నియోజకవర్గాల్లో ఎలా ఉంటుందో ఆలోచించాలన్నారు. తాను చేసేది పవిత్ర యాత్ర అని ప్రజల కోసమే తప్ప స్వార్థ కోసం కాదని చంద్రబాబు తెలియజేశారు. తన తల్లి పడ్డ కష్టం ఏ తల్లి పడకూడదనే 35 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఇస్తే, కాంగ్రెస్ వాల్లు ప్రజలకు కట్టెల పొయ్యినే శరణ్యం చేశారని వ్యాఖ్యానించారు.

ఇందిరమ్మ ఇళ్ల పేరుతో కాంగ్రెస్ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారని బాబు పేర్కొన్నారు. తమ ప్రభుత్వ హయాంలో దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని ఆయన గుర్తు చేశారు. అంతకు ముందు కదిరిదేవరపల్లి గ్రామస్థులతో ముఖాముఖి నిర్వహించిన చంద్రబాబు వారి సమస్యలను అడిగితెలుసుకున్నారు.

జిల్లాలోని కల్యానదుర్గం నియోజకర్గంలోని కుర్లపల్లిలో పాదయాత్ర ప్రారంభమై కదిరిదేవరపల్లి, ములకనూరు మీదుగా మధ్యాహ్నానికి ములకనూరుమిట్టకు చేరుకుని చంద్రబాబు భోజనం చేశారు. అరగంట విశ్రాంతి తర్వాత దాసంపల్లి మీదుగా బోయలపల్లికి చేరుకుని అక్కడ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు అనంతరం రామక్కపల్లి, కురబరహళ్లి క్రాస్ మీదుగా నారాయణపురం క్రాస్ వరకు యాత్ర కొనసాగిస్తారు. మొత్తం 18.8 కిలోమీటర్ల దూరం నడిచి, అక్కడే రాత్రికి బస చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+