వచ్చే ఎన్నికల్లో శ్రీరామ్ పోటీ చేయడు: పరిటాల సునీత

దీంతో శ్రీరామ్ త్వరలో రాజకీయరంగ ప్రవేశం చేయనున్నారని జోరుగా ఊహాగానాలు చెలరేగాయి. కాగా చంద్రబాబు పాదయాత్రలో పరిటాల శ్రీరామ్ కనిపించిన విషయం తెలిసిందే. దీంతో అతను క్రియాశీలక రాజకీయాల్లోకి రానున్నారనే వార్తలు వచ్చాయి. చంద్రబాబు పాదయాత్రలో ఆయన చురుగ్గా కనిపించారు. రాప్తాడు నియోజకవర్గంలో చంద్రబాబు వెంట పరిటాల సునీతతో పాటు పరిటాల శ్రీరామ్ కూడా ఉన్నారు. పైగా, యువకుల నుంచి పరిటాల శ్రీరామ్‌కు ఆహ్వానం కూడా అందుతోంది.
పరిటాల శ్రీరామ్ పార్టీలో చురుకైన పాత్ర నిర్వహించే విధంగా చూసేందుకు చంద్రబాబు కూడా సిద్ధపడినట్లు అర్థమవుతోంది. పరిటాల శ్రీరామ్ మాట్లాడాలని అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం తిమ్మాపురంలో చంద్రబాబు ప్రసంగిచిన తర్వాత కార్యకర్తలు అడిగారు. దానికి చంద్రబాబు ప్రతిస్పందిస్తూ - శ్రీరామ్ మాట్లాడడమే కాదు, నాయకత్వం వహిస్తాడని చంద్రబాబు అన్నారు. దీన్ని బట్టి శ్రీరామ్ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తాడనేది అర్థమవుతోంది.
దివంగత తెలుగుదేశం పార్టీ నాయకుడు పరిటాల రవి పెద్ద కుమారుడు పరిటాల శ్రీరామ్ రాజకీయ రంగ ప్రవేశానికి రంగం సిద్ధమైనట్లు ఈ ఏడాది జనవరిలో ప్రచారం సాగింది. అనంతపురంలోని తన నివాసంలో అప్పట్లో ఆయన రాప్తాడు, అనంతపురం శాసనసభా నియోజకవర్గాలకు చెందిన పరిటాల అభిమానులతో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. పరిటాల రవి వర్ధంతి కార్యక్రమంపై ఆయన వారితో చర్చించారు.
ఇక నుంచి పరిటాల రవి ట్రస్టు నిర్వహించే అన్ని కార్యక్రమాల్లో తాను ముందు ఉంటానని శ్రీరామ్ అప్పట్లో చెప్పారు. రాజకీయం పెద్దలు చూసుకుంటారని, రాజకీయం గురించి మాట్లాడే వయస్సు తనకు లేదని శ్రీరామ్ అన్నప్పటికీ భవిష్యత్తు రాజకీయాలను దృష్టిలో ఉంచుకునే ఆయన క్రియాశీలకంగా ముందుకు వస్తున్నట్లు ప్రచారం సాగింది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి సూచన మీద, అభిమానుల కోరిక మీద శ్రీరామ్ రాజకీయ రంగ ప్రవేశం ఆధారపడి ఉంటుందని పార్టీ శాసనసభ్యురాలు, పరిటాల శ్రీరామ్ తల్లి పరిటాల సునీత కూడా చెప్పారు.












Click it and Unblock the Notifications