జీ ఛానల్‌పై జిందాల్ కంపెనీ బ్లాక్‌మెయిల్ కేసు, ఖండన

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బొగ్గు గనుల స్కాంలో కాంగ్రెస్ ఎంపీ నవీన్ జిందాల్‌కు చెందిన కంపెనీకి కూడా అనుచిత లబ్ధి కలిగిందన్న వార్తలు ఇంతకుముందు వచ్చాయి. ఈ విషంలో జీ బిజినెస్ చానల్ తమను బెదిరించిందని, రూ.50 కోట్లు ఇవ్వకపోతే ఈ కుంభకోణంపై తమ మీద ప్రత్యేక కథనం చేస్తామంటూ బ్లాక్‌మెయిల్ చేసిందని నవీన్ జిందాల్‌కు చెందిన కంపెనీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీంతో.. కంపెనీ ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులలోని క్రైం బ్రాంచి విభాగం జీ బిజినెస్ చానల్ వర్గాలపై బలవంతపు వసూళ్ల కేసును నమోదు చేసింది. అయితే, ఈ ఆరోపణలన్నీ కట్టుకథలేనని, తమను ఇలాంటి కథనాలు ప్రసారం చేయకుండా ఒత్తిడి చేసే వ్యూహమేనని చానల్ అధినేత సుధీర్ చౌదరి అన్నారు. బొగ్గు గనుల కుంభకోణంపై అధికార పత్రాల ఆధారంగా తాము అనేక కథనాలు రూపొందించామని, అవినీతిపై తమ అలుపెరుగని పోరాటాన్ని అడ్డుకునేందుకు చేస్తున్న ప్రయత్నమని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications