గవర్నర్‌గా నియామకం: రోశయ్యకు సుప్రీంలో ఊరట

విచారణ జరిపిన న్యాయస్థానం పిటిషన్‌ను తోసిపూచ్చింది. ఎసిబి కేసు ఉండగా రోశయ్యను గవర్నర్‌గా నియమించలేదని తెలిపింది. నియామకంలో ఎక్కడా ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరగలేదన్నారు. ఎసిబి కోర్టు రోశయ్యకు సమన్లు ఇవ్వడం చట్ట విరుద్ధమని వ్యాఖ్యానించింది. గవర్నర్ అయిన పది నెలల తర్వాత ఎసిబి కోర్టు సమన్లు ఇవ్వడం చట్ట విరుద్ధమని పేర్కొంది. ఎసిబి కేసు ఉండగా రోశయ్య నియామకం చెల్లదని మోహన్ లాల్ అనే న్యాయవాది సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని కోర్టు ఈరోజు తోసిపుచ్చింది.
మరోవైపు ఎసిబి కోర్టుకు రోశయ్య వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని దాఖలైన పిటిషన్‌ను కూడా కోర్టు కొట్టివేసింది. అమీర్‌పేట భూముల కేసులో రోశయ్యకు హైకోర్టులో కూడా ఊరట లభించిన విషయం తెలిసిందే. రోశయ్య వ్యక్తిగత హాజరుపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు స్టే ఇచ్చింది. రోశయ్య రాజ్యాంగబద్దమైన వ్యక్తి అని, ఆయన గవర్నర్‌గా ఉన్నంత వరకు ఎలాంటి నోటీసులు జారీ చేయవద్దని ఆదేశించింది. ఇంతకుముందు జారీ చేసిన నోటీసులు చెల్లవని పేర్కొంది.












Click it and Unblock the Notifications