బాబు యాత్ర టిడిపి కోసం కాదన్న కొండ్రు, కిరణ్ విమర్శ

కాంగ్రెసు పార్టీని విమర్శించే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. తొమ్మిదేళ్ల పాలనలో చంద్రబాబు, ఆ పార్టీ నేతలు పందికొక్కుల్లా రాష్ట్ర సంపదను దోచుకున్నారన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తుంది కాంగ్రెసు మాత్రమేనని, చంద్రబాబు ఇవ్వరన్నారు. బాబు తొలి నుండి అబద్దాలు చెప్పే రకమని, ఆయన మాటలను ఎవరూ నమ్మరన్నారు. ఆయనను ప్రజలు గమనిస్తున్నారని, కిరణ్ ప్రభుత్వంపై ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
ఖబర్దార్ చంద్రబాబు అని నిప్పులు గక్కారు. చంద్రబాబు ఎంత పాదయాత్ర చేస్తే కాంగ్రెసుకు అంత మంచిదన్నారు. తన హయాంలో రాష్ట్రాన్ని దయ్యం పట్టి పీడించినట్లుగా పాలించారని మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా గానీ, ప్రతిపక్ష నేతగా గానీ పూర్తిగా విఫలమయ్యారని, ఏ మొహం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్తున్నాడో చెప్పాలన్నారు. ఆయన చేపడుతున్న యాత్రం ప్రజల కోసమే, టిడిపి కోసమో కాదన్నారు. తన తనయుడు లోకేష్ కోసమే ఆయన యాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
రోజు అబద్దాలు చెప్తారు.. కిరణ్
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రోజూ అబద్దాలు చెప్తుంటారని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకాశం జిల్లాలో అన్నారు. ఆయన కల్లిబొల్లి మాటలను ఎవరూ నమ్మడం లేదన్నారు. ఆయన ప్రకటించిన బిసి డిక్లరేషన్ వట్టి బోగస్ అని చెప్పారు.












Click it and Unblock the Notifications