నో అన్నదని ఫేక్ ఫేస్‌బుక్, అశ్లీలమెయిల్స్: టెక్కీ అరెస్ట్

ఈ విషయాన్ని సిఐడి అదనపు డిజి ఎస్వీ రమణమూర్తి వెల్లడించారు. బాధితురాలు అతని ప్రేమ, పెళ్లి ప్రపోజలన్‌ను తిరస్కరించడంతో సాయి కుమార్ ఈ దుర్మార్గానికి పాల్పడ్డాడు. సాయి కుమార్ పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం... ఇతను మొదట హైదరాబాదులో మూడేళ్లు పని చేశాడు. అదే కంపెనీలో ఉద్యోగం చేస్తున్న యువతితో పరిచయం అయింది. సాయి కుమార్ ఆమె ముందు పెళ్లి ప్రపోజల్ పెట్టాడు. ఆమె నిరాకరించింది.
అప్పటి నుండి అతను ఆ యువతినిని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. అయితే ఆ యువతి కౌన్సెలింగ్ ద్వారా అతడిని మార్చే ప్రయత్నాలు చేసిందని పోలీసులు చెబుతున్నారు. ఆ తర్వాత ఇతను 2011లో అమెరికాకు వెళ్లాడు. అక్కడికి వెళ్లినప్పటికీ అతను యువతిని బ్లాక్ మెయిల్ చేయడం మానలేదు. ఆమె ఈ మెయిల్స్ హ్యాక్ చేయడం, ఆమె పేరు మీద ఫేక్ ఫేస్ బుక్ సృష్టించి కంపెనీ సహచరులకు, స్నేహితులకు, ఇతరులకు ఆమె పేరు మీద అశ్లీల ఫోటోలు పంపడం చేస్తుండేవాడు.
ఇద్దరూ ఒకే దగ్గర పని చేసిన సమయంలో వారిద్దరు కలిసి ఫోటోలు దిగారు. వీటిని ఉపయోగించి అతడు ఫేక్ ప్రొఫైల్స్ తయారు చేసి బాధితురాలి ఇమేజ్ దెబ్బతీసే ప్రయత్నాలు చేశాడు. ఆమె పేరుతో రూపొందించిన వాటి ద్వారా అతను ఆమె సన్నిహితులు, బంధువులతో ఇష్టం వచ్చినట్లుగా చాట్ చేసేవాడు. పోలీసులు అతనిపై ఐపిసి 506, 384, 66ఏ, 67 ఐటి యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !!












Click it and Unblock the Notifications