వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శాంతినికేతన్‌లో మణిపూర్ విద్యార్థినికి వేధింపులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Molesting Student
కోల్‌కతా: పిహెచ్‌డి చదువుతున్న విద్యార్థినికి మార్గదర్శనం చేయాల్సిన లెక్చరర్ ఒకరు వేధింపులకు గురి చేయడంతో ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతా శాంతినికేతన్‌లో విశ్వభారతి విశ్వవిద్యాలయంలో జరిగింది.

ఈ సంఘటనపై ఉన్నతాధికారులు విశ్వవిద్యాలయ స్టాండింగ్ కమిటీ ద్వారా విచారణకు ఆదేశించారు. సిద్దార్థ దేవ్ ముఖోపాధ్యాయ అనే అధ్యాపకుడు విద్యార్థుల సంక్షేమానికి సంబంధించిన విభాగానికి డీన్‌గా ఉన్నారు. దాంతో ఆయనను విచారణ ముగిసే వరకు ఆ పదవి నుండి తొలగించారు.

బాధితురాలు మణిపూర్‌ రాష్ట్రానికి చెందిన విద్యార్థిని అని ఆమె స్వరాష్ట్రానికి వెళ్లి పోయిందని విశ్వవిద్యాలయ వర్గాలు తెలిపాయి. ఆమెను ఒప్పించి తిరిగి యూనివర్శిటీకి తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అధ్యాపకుడు తప్పు చేశాడని తేలితే చర్యలు తప్పవన్నారు.

అధ్యాపకుడు విద్యార్థినిని అక్టోబర్ 2వ తేదిన వేధించాడు. ఆ విద్యార్థిని అప్పుడే విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్‌కు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాతే ఆమె తన ఇంటికి వెళ్లిపోయింది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి పోలీసు కేసు నమోదు కాలేదు.

అసొంలో పడవలు మునిగి ఏడుగురు మృతి

అసోం రాష్ట్రంలోని మోరిగావ్ వద్ద నదిలో రెండు పడవలు మునిగి పోవడంతో ఏడుగురు మృతి చెందారు. మరికొందరు గల్లంతయ్యారు. మృతులలో ఐదుగురు పాఠశాల విద్యార్థులు ఉన్నారు. గల్లంతైన వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.

English summary
A professor at the Viswa Bharati University in Shantiniketan in West Bengal has been accused of molesting a PhD student.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X