విజయ్ జీతం ఎంతో తెలుసా? సీఎంగా పన్నులు ఎంత కట్టాలి!

తమిళనాడు రాజకీయ చరిత్ర నవ శకం ప్రారంభమైంది. 'తలపతి' విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వేళ.. రాష్ట్రవ్యాప్తంగా అటు వేడుకలు అంబరాన్ని అంటాయి. ఈ క్రమంలోనే సీఎంగా విజయ్ జీతభత్యాలపై ఆసక్తికర చర్చ మొదలైంది. అసలు ఒక ముఖ్యమంత్రికి శాలరీ ఎంత? మంత్రులకు, ఎమ్మెల్యేలకు నెలకు ఎంత జీతం అందుతుంది? వారి ఆదాయంపై పన్నులు ఎలా విధిస్తారు? అన్న విషయాలను సవివరంగా తెలుసుకుందాం.

ప్రస్తుత లెక్కల ప్రకారం, తమిళనాడులో ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యే వరకు అందుతున్న అధికారిక వేతనాలు వివరాలు..

Tamil Nadu CM Vijay Salary Exposed Understanding Tax Rules For Chief Ministers And MLAs In 2026 Era
  • ముఖ్యమంత్రి (CM): నెలకు సుమారు రూ.2.85 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు (అలవెన్సులతో కలిపి).
  • మంత్రులు: వీరికి కూడా దాదాపు ముఖ్యమంత్రితో సమానంగా లేదా కొంచెం తక్కువగా రూ.2.50 లక్షల వరకు అందుతుంది.
  • ఎమ్మెల్యేలు (MLAs): నెలకు రూ.1,05,000 నుంచి రూ.1.15 లక్షల వరకు జీతభత్యాలు ఉంటాయి. ఇందులో బేసిక్ పేతో పాటు నియోజకవర్గ అలవెన్స్, టెలిఫోన్, వైద్య ఖర్చులు ఉంటాయి.
సీఎం సార్.. లుక్ అదిరింది! ఫార్మల్ లుక్‌లో విజయ్ ఎంట్రీ
సీఎం సార్.. లుక్ అదిరింది! ఫార్మల్ లుక్‌లో విజయ్ ఎంట్రీ

ముఖ్యమంత్రికి పన్ను పోటు.. ఎమ్మెల్యేలకు వెసులుబాటు!

విజయ్ లాంటి స్టార్ హీరో, రూ.600 కోట్లకు పైగా ఆస్తులు ఉన్న వ్యక్తి ఇప్పుడు ప్రజా ప్రతినిధిగా పొందే జీతంపై పన్ను ఎలా ఉంటుందనేది ఆసక్తికరం. ఇక్కడ ఒక వింతైన చట్టం ఉంది:

1. ముఖ్యమంత్రి ఒక 'ఉద్యోగి' కింద లెక్క:

ముఖ్యమంత్రికి అందే రెమ్యునరేషన్‌ను ఆదాయపు పన్ను శాఖ 'జీతం' (Salary) గా పరిగణిస్తుంది. గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ కేసులో కోర్టు ఇదే స్పష్టం చేసింది. ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి మధ్య 'యజమాని-ఉద్యోగి' (Employer-Employee) సంబంధం ఉంటుందని చట్టం చెబుతోంది. కాబట్టి, సామాన్య ఉద్యోగుల్లాగే సీఎం కూడా స్టాండర్డ్ డిడక్షన్‌తో పాటు అన్ని రకాల ఆదాయ పన్ను శ్లాబుల కింద పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

2. ఎమ్మెల్యేలు, ఎంపీలకు మాత్రం వేరే దారి:

ఎమ్మెల్యేలు - ఎంపీలు 'ప్రభుత్వ ఉద్యోగులు' కాదు, వారు ప్రజల ప్రతినిధులు. అందుకే వారి జీతాన్ని 'శాలరీ' కింద కాకుండా 'ఇతర వనరుల నుండి ఆదాయం' (Income from Other Sources) కింద చూపిస్తారు. వీరికి యజమాని-ఉద్యోగి సంబంధం ఉండదు కాబట్టి, వీరు తమ ఆఫీసు ఖర్చులు, సెక్రటేరియల్ సహాయం వంటి వాటిపై మినహాయింపులు పొందే అవకాశం ఉంటుంది.

TVK ఎమ్మెల్యేగా ఆటో డ్రైవర్.. కట్ చేస్తే కోటీశ్వరుడా?
TVK ఎమ్మెల్యేగా ఆటో డ్రైవర్.. కట్ చేస్తే కోటీశ్వరుడా?

విజయ్ @ 624 కోట్లు.. రాజకీయ పారదర్శకత!

విజయ్ తన అఫిడవిట్‌లో సుమారు రూ.624 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. ఒక ముఖ్యమంత్రి తన సొంత ఆదాయం (సినిమాలు, వ్యాపారాల ద్వారా వచ్చేది) ప్రభుత్వం ఇచ్చే జీతం రెండింటినీ వేర్వేరుగా లెక్కించి ఆదాయపు పన్ను రిటర్న్స్ (ITR) దాఖలు చేయాల్సి ఉంటుంది.

సినిమాల్లో కోట్లాది రూపాయల పారితోషికం తీసుకున్న విజయ్, ఇప్పుడు ప్రజల సేవకుడుగా నెలకు సుమారు రూ.3 లక్షల జీతం అందుకోబోతున్నారు. అయితే ఆ జీతంపై కూడా రూపాయి రూపాయి లెక్క చూపిస్తూ పన్ను చెల్లించాల్సి రావడం మన ప్రజాస్వామ్యంలోని విశేషం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+