హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణపై నో డెడ్‌లైన్, బాబుకు భయమా: కెటిఆర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

KT Rama Rao
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాము ఎలాంటి డెడ్‌లైన్‌లు పెట్టలేదని, పెట్టబోమని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సిరిసిల్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు బుధవారం అన్నారు. తెలంగాణ వచ్చే వరకు తాము ఉద్యమిస్తామని చెప్పారు. తమ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు చర్చలతో ఢిల్లీలో తెలంగాణపై కదలిక వచ్చిందన్నారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలపై ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని ఆరోపించారు.

విద్యార్థులు, ఉద్యోగులపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తి వేయాలని లేదంటే టిఆర్ఎస్ ఉద్యమాన్ని ఉధృతం చేస్తుందని హెచ్చరించారు. ఉద్యమకారులపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి పోయేకాలం దగ్గర పడిందన్నారు. అందుకే ఉద్యమకారులను ఉద్దేశ్య పూర్వకంగా రెచ్చగొడుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ప్రభుత్వంలో ఏ శాఖ ఏం చేస్తుందో ఎవరికీ తెలియడం లేదన్నారు. పారదర్శక పాలనకు కిరణ్ పాతర వేశాడని నిప్పులు చెరిగారు. తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితిని ఏర్పాటు చేసిందే కెసిఆర్ అన్నారు. లోటుపాట్లను సవరించుకొని ఐకాసతో కలిసి పని చేస్తామని కెటిఆర్ చెప్పారు. తెలంగాణ సాధన కోసం జెఏసిని మరింత బలోపేతం చేస్తామన్నారు. పార్టీ స్వార్థం కోసమే అయితే జెఏసిని ఏర్పాటు చేసి ఉండేవాళ్లమే కాదన్నారు.

చంద్రబాబుపై విమర్శలు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు లేటు వయస్సులో ప్రజలపై ఘాటు ప్రేమ కలిగిందని ఎద్దేవా చేశారు. ఆయన తన పాదయాత్రకు వస్తున్నా మీకోసం కాకుండా చస్తున్నా కుర్చీ కోసం అని పెట్టుకుంటే బాగుండేదన్నారు. తన హయాంలో చంద్రబాబు ఏ తప్పు చేయకుంటే ఐఎంజి కేసులో సిబిఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. బాబు ఎలాంటి తప్పు చేయలేదని భావిస్తే వెంటనే విచారణకు సిద్ధపడాలని సవాల్ విసిరారు.

English summary
Telangana Rastra Samithi MLA Kalvakuntla Taraka Rama Rao said that they did not put any deadline to Central Government on Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X