హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వారసత్వ పోరు: పైచేయికి వారితో వీరు ఫైట్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వారసత్వ పోరు సాధారణమైపోయింది. ఈ వారసత్వ పోరులో ఎవరు విజయం సాధిస్తారు, ఎవరు వెనక్కి తగ్గుతారనేది వారి వారి వ్యూహాల మీద, ఆచరణ మీద ఆధారపడి ఉంటుంది. తమ పెద్దలు ఎవరికి తోడ్పాటు అందిస్తారనేది కూడా అతి ముఖ్యంగా మారిపోతుంది.

నారా లోకేష్‌-జూనియర్ ఎన్టీఆర్

నారా లోకేష్‌-జూనియర్ ఎన్టీఆర్

తెలుగుదేశం పార్టీలో వారసత్వ పోరు ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికిప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌పై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ పైచేయి సాధించినట్లు కనిపిస్తున్నారు.

షర్మిళ-వైయస్ జగన్-వైయస్ విజయమ్మ

షర్మిళ-వైయస్ జగన్-వైయస్ విజయమ్మ

వైయస్ జగన్ తల్లి వైయస్ విజయమ్మకు అంత సత్తా ఉందా అనేది సందేహంగా మారింది. ఈ స్థితిలో వైయస్ జగన్ సతీమణి భారతి ముందుకు వస్తారా అంటే కాదనే జవాబు వస్తోంది.

కె. చంద్రశేఖర రావు-కెటి రామారావు

కె. చంద్రశేఖర రావు-కెటి రామారావు

ఇదిలావుంటే, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో సమరం గమ్మత్తయింది. తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తర్వాతి స్థానం ఆక్రమించిన మేనల్లుడు హరీష్ రావు కుమారుడు కెటి రామారావు ప్రవేశంతో వెనక్కి తగ్గాల్సి వచ్చినట్లు చెబుతారు.

తెలుగుదేశం పార్టీలో వారసత్వ పోరు ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికిప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌పై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ పైచేయి సాధించినట్లు కనిపిస్తున్నారు. నందమూరి, నారావారి కుటుంబాల మధ్య వారసత్వ పోరు హోరాహోరీగా జరిగి, పాదయాత్రతో చంద్రబాబు తన కుమారుడికి లైన్ క్లియర్ చేసినట్లు భావిస్తున్నారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ నారా లోకేష్‌కు సరిరారనే మాట వినిపిస్తోంది. కానీ, సినిమాల్లో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ తదుపరి కార్యాచరణ ఎలా వుంటుందో చెప్పలేం.

ఇక, వైయస్ జగన్ నాయత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు విషయానికి వస్తే, ట్రయాంగిల్ ఫైట్ లాగా కనిపిస్తోంది. తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని స్వీకరించడానికి సొంత పార్టీ పెట్టిన వైయస్ జగన్ ఇప్పుడు జైలులో ఉన్నారు. దాంతో వైయస్ జగన్ బయటకు వచ్చేంత వరకైనా పార్టీని నడిపించేదెవరనే చర్చ సాగుతోంది.

వైయస్ జగన్ తల్లి వైయస్ విజయమ్మకు అంత సత్తా ఉందా అనేది సందేహంగా మారింది. ఈ స్థితిలో వైయస్ జగన్ సతీమణి భారతి ముందుకు వస్తారా అంటే కాదనే జవాబు వస్తోంది. ఉప ఎన్నికల్లో ప్రత్యేక ఆకర్షణగా మిగిలిన షర్మిళను భారతితో అంతర్గత పోరు మొదలైనట్లు చెబుతారు. దాంతో షర్మిళ కొంత కాలం వెనక్కి తగ్గినట్లు కూడా ప్రచారం సాగింది. అయితే, భారతి సంస్థల వ్యవహారాలు, కేసుల వ్యవహారాలు చూసుకోవాల్సి రావడంతో షర్మిళను ముందు పెట్టక తప్పడం లేదనే మాట వినిపిస్తోంది.

ఇదిలావుంటే, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో సమరం గమ్మత్తయింది. తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తర్వాతి స్థానం ఆక్రమించిన మేనల్లుడు హరీష్ రావు కుమారుడు కెటి రామారావు ప్రవేశంతో వెనక్కి తగ్గాల్సి వచ్చినట్లు చెబుతారు. అయితే, కెటి రామారావుకు తన సోదరి కల్వకుంట్ల కవిత నుంచి పోటీ ఎదురవుతోందని అంటున్నారు.

పార్టీలోకి ఆమెకు ప్రవేశం లేకపోయినా సొంతంగా తెలంగాణ జాగృతి సంస్థను ఏర్పాటు చేశారు. దాని ద్వారా సొంతంగానే ఆమె ఆందోళనలు, కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి విషయంలో ముందుంటూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. యేటా బతుకమ్మ సంబరాలు నిర్వహించడం నుంచి ట్యాంక్‌బండ్‌పై విగ్రహాల ప్రతిష్టాపనను వ్యతిరేకించడం వరకు ఆమెనే కనిపిస్తున్నారు. కెటి రామారావును అధిగమించేందుకు ఆమె తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు.

మొత్తంగా, వారసత్వ రాజకీయాల్లోనూ అంతర్గత పోరు తెలుగు రాజకీయాల్లో రంజుగానే సాగుతోందని అంటున్నారు.

English summary
The young leaders in YSR Congress party YS Jagan, Nara Lokesh and KT Ramarao are facing fight from Sharmila, Jr NTR and Kalwakuntla Kavitha respectively.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X