శ్రీవారికి రూ.1.25 కోట్ల విలువ చేసే విగ్రహాలు

గత నెల 28న హుండీలో ఈ కానుకలను సమర్పించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) వర్గాలు భావిస్తున్నాయి. ఈ మూడు విగ్రహాల్లో 1014 వజ్రాలు, 552 కెంపులు, 197 పచ్చలు, ఒక శ్రేష్టమైన నీలం వున్నట్లు గుర్తించారు. ఈ విగ్రహాలకు సంబంధించి టిటిడి అధికారులు గురువారం మదింపు కట్టారు. 14 అంగుళాల ఎత్తు వున్న మూలవిరాట్టును పోలి ఉన్న శ్రీవారి విగ్రహం 2కేజీల 57 గ్రాముల బరువు వుంది.
స్వామివారి విగ్రహంలోని ఫీఠానికి 28 వజ్రాలు, చక్రానికి 90, శంఖానికి 112, నామానికి 44, స్వామివారి శరీరంపై వున్న మొదటి హారానికి 36, రెండవ హారానికి 38, మూడవ హారానికి 68, పట్టీలకు 13 డైమండ్స్ వున్నాయి. కిరీటం పైభాగాన 16, మధ్య భాగాన 31, క్రింది భాగంలో 10 డైమండ్లు పొదిగి వున్నారు. 12 గ్రాముల బరువుకల్గిన లక్ష్మివిగ్రహానికి 40 వజ్రాలు పొదిగారు. ఈ విగ్రహం విలువ 2,99,900 రూపాయలుగా మదింపు వేశారు.
పద్మావతి అమ్మవారి విగ్రహం 81 గ్రాముల బరువుకాగా 2,34,900 రూపాయలుగా విలువ కట్టారు. ఈ విగ్రహంలో 30 వజ్రాలు వున్నట్లు మదింపుకట్టారు. మొత్తం మీద ఈ మూడు విగ్రహాల్లో పొదిగి వున్న వజ్రాలు 2సెంట్లు నుండి 10 సెంట్లు వున్నట్లు టిటిడి వర్గాలు తెలిపాయి. ఈ మూడు విగ్రహాల విలువను 1 కోటి 25 లక్షల, 27 వేల 800లుగా మదింపు వేశారు.












Click it and Unblock the Notifications