వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నవంబర్ 3దాకా జైల్లోనే గాలి, రిమాండ్ పొడగింపు

By Pratap
|
Google Oneindia TeluguNews

Gali Janardhan Reddy
బెంగళూరు/ హైదరాబాద్: వచ్చే నెల 3వ తేదీ వరకు కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి జైల్లో ఉండాల్సిందే. అక్రమ మైనింగ్ కేసులో అరెస్టయిన గాలి జనార్దన్ రెడ్డితో పాటు మరో ఐదుగురిని జ్యూడిషియల్ రిమాండ్‌ను బెంగళూర్ సిబిఐ కోర్టు న్యాయమూర్తి బిఎం అంగడి నవంబర్ 3వ తేదీ వరకు పొడగిస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.

హైదరాబాద్‌లోని చంచల్‌గుడా జైలులో ఉన్న జనార్దన్ రెడ్డిని న్యాయమూర్తి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించారు. బెయిల్ కుంభకోణం కేసులో గాలి జనార్దన్ రెడ్డిని ఎసిబి హైదరాబాదుకు తరలించిన విషయం తెలిసిందే. కాగా, ఒఎంసి కేసులో నిందితుడిగా ఉన్న గాలి జనార్దన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు అలీఖాన్ పోలీసు కస్టడీలో ఉండడంతో బెంగళూర్ సిబిఐ కోర్టు అతన్ని విచారించలేకపోయింది.

బెంగళూర్‌లోని పరప్పన అగ్రహార జైలులో ఉన్న మరో ముగ్గురిని కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. ఈ ముగ్గురి బెయిల్ పిటిషన్లను కోర్టు ఇది వరకే తోసిపుచ్చింది. దాంతో బెయిల్ కోసం వారు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసుకున్నారు. బళ్లారి జిల్లా అప్పటి డిప్యూటీ కన్జర్వేటర్ ఎస్. ముత్తయ్య, అప్టి గనులు, జియోలజీ డైరెక్టర్ ఎస్పీ రాజు బెయిల్ పిటిషన్లను రెండు రోజుల క్రితమే హైకోర్టు తోసిపుచ్చింది. అలీఖాన్ బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు అంతకు ముందే కోట్టేసింది.

ఇదిలావుంటే, బెయిల్ డీల్ కుంభకోణం కేసులో హైదరాబాద్ ఎసిబి కోర్టు గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ను శుక్రవారం కొట్టేసింది. గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయించడానికి పెద్ద కుంభకోణం జరిగినట్లు వెల్లడైన నేపథ్యంలో ఆ కేసును ఎసిబి విచారిస్తోంది.

English summary
A CBI court on Friday extended to November 3, the judicial custody of mining baron G Janardhana Reddy and four others, arrested in an illegal mining case. CBI court judge BM Angadi extended the judicial custody of the accused till November 3.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X