వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గర్ల్స్ అంగీకారంతోనే అత్యాచారాలు: పిసిసి ప్రతినిధి

అమ్మాయిల్లో 90 శాతం మంది ఉద్దేశపూర్వకంగానే లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనేందుకు ముందుకు వస్తున్నారని, అయితే తమ దారిలో ఒక్కరి కన్నా ఎక్కువ మంది కామాంధులు ఎదురుపడతారని, వారి చేతుల్లో సామూహిక అత్యాచారాలకు గురువుతామని అమ్మాయిలకు తెలియదని ఆయన అన్నారు.
గోయత్‌కు హర్యానా పిసిసి వెంటనే క్రమశిక్షణ నోటీసు జారీ చేసింది. 15 రోజుల్లోగా ఆ వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. గోయత్ వ్యాఖ్యల్లోని ప్రమాదాన్ని గుర్తించిన పిసిసి అంత త్వరగా ప్రతిస్పందించి, చర్యలకు దిగినట్లు భావిస్తున్నారు.
హర్యానాలో ఇటీవల అత్యాచారాలు పెరిగిన విషయం తెలిసిందే. అత్యాచారాలకు గురైన బాధితులను ఇటీవల కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా పరామర్శించారు. హర్యానాలో జరుగుతున్న అత్యాచారాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.