వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గన్‌తో వీరంగం సృష్టించి, బెదిరించిన ఎంపి

By Pratap
|
Google Oneindia TeluguNews

Vithal Radadiya
అహ్మదాబాద్: ఓ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు గుజరాత్‌లో వీరంగం సృష్టించాడు. టోల్ గేట్ సిబ్బందికి గన్ గురిపెట్టి బెదిరించాడు. సిసిటివీలో దృశ్యం చిత్రీకరణ జరిగినా అతను ఏ మాత్రం తొణకలేదు, బెణకలేదు. అందుకు గుజరాత్‌లో పోర్‌బందర్ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు విఠల్ రాడియాపై పోలీసులు కేసు నమోదు చేశారు.

టోల్ గేట్ సిబ్బంది అక్టోబర్ 10వ తేదీ రాత్రి వడదొర సమీపంలోని కర్జాన్ గ్రామం వద్ద ఆపారు. కారు డ్రైవర్ పార్లమెంటు సభ్యుడి జిరాక్స్ ఐడెంటిటీ కార్డును టోల్ గేట్ సిబ్బందికి చూపించాడు. అయితే వారు ఒరిజినల్ కావాలని అడిగారు. దీంతో ఎంపిగారికి ఆగ్రహం వచ్చింది. ఆలస్యం అవుతుందంటూ ఎంపిగారు కారు దిగేసి తన లైసెన్స్‌డ్ గన్ టోల్ గేట్ సిబ్బందికి గురి పెట్టారు.

టోల్ గేట్ సిసిటివీ ఎంపిగారు బెదిరించిన వైనాన్ని రికార్డు చేసింది. ఇతర వాహనదారులు కూడా బెదిరిపోయి నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోయారు. మాట కూడా మాట్లాడలేదు, జోక్యం చేసుకోలేదు. రాడియా బెదిరింపు మాటల ఫుటేజీని ఎన్డీటివీ శుక్రవారం ప్రసారం చేసింది.

తనను దాదాపు 15 మంది ఘెరావ్ చేయడంతో గన్ బయటకు తీశానని రాడియా బుకాయించే ప్రయత్నం చేశాడు. అయితే, రాడియా సమీపంలో మనుషులెవరూ కనిపించలేదని ఎన్డీటివి యాంకర్ వ్యాఖ్యానించారు. ఆత్మరక్షణ కోసమే తాను గన్ తీశానని టీవీ యాంకర్ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా అతను చెప్పాడు.

కారు దిగిన తర్వాత కూడా తనను బోగస్ ఎంపిగా టోల్ గేట్ సిబ్బంది అభివర్ణించారని, అలా అన్నప్పుడు తన ఐడెంటిటీ కార్డు బోగస్ అన్నట్లే కదా అని రాడియా అన్నాడు. రాడియా సంఘటనపై పార్టీ పరిశీలిస్తుందని, అధికార దుర్వినియోగానికి పాల్పడి ఉంటే రాడియాపై చర్యలు తీసుకుంటామని ఎఐసిసి అధికార ప్రతినిధి మనీష్ తివారీ ఢిల్లీలో అన్నారు.

English summary
The Congress MP who brandished his licensed gun at employees manning a toll booth in Gujarat avers that he was not in the wrong despite CCTV footage of the incident clearly contradicting his version of events.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X