వాన్‌పిక్ కోసం వైయస్ ప్రత్యేక కార్యదర్శి బెదిరింపులు?

'Chief Minister’s Office behind Vanpic land fraud'
హైదరాబాద్: వాన్‌పిక్ ప్రాజెక్టుకు భూసేకరణ, బదలాయింపు ప్రక్రియకు సంబంధించి తాను ముఖ్యమంత్రి కార్యాలయం నుండి తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొన్నానని, భూసేకరణ ప్రక్రియ గురించి వాన్‌పిక్ ప్రతినిధులు ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి భానుకు ఫిర్యాదు చేసేవారని, ఈ ఫిర్యాదులపై ఆయన తీవ్రంగా స్పందించేవారని, భూసేకర ణ ప్రగతిపై ప్రతి రోజు ఉదయం ఆరు గంటలకల్లా ఫోన్ చేసి చెప్పాలని, లేదంటే ఆ తర్వాత ముఖ్యమంత్రి లైన్లోకి వస్తారని బెదిరంచారని చెప్పారని తెలుస్తోంది.

ఒత్తిడి వద్దని ఆయనను కలిసి కూడా వేడుకున్నానని సీనియర్ ఐఏఎస్ అధికారి దేవానంద్ సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పినట్లుగా తెలుస్తోంది. దేవానంద్ వాన్‌పిక్‌కు భూముల కేటాయింపు సమయంలో ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా ఉన్నారు. ఆయన సిబిఐ ముందు ముఖ్యమంత్రి కార్యాలయం ఒత్తిడి తెచ్చినట్లుగా చెప్పారు. భాను తనను తిట్టే వారని దేవానంద్ చెప్పారని సమాచారం.

వాన్‌పిక్ ప్రాజెక్టులో భాగమైన పారిశ్రామిక కారిడార్‌కు గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 24వేల ఎకరాలను సేకరించాలని, వైయస్ సర్కారు నిర్ణయించడం, రెండు జిల్లాల కలెక్టర్లను ఆ దిశగా పరుగులు పెట్టించినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా వాంగ్మూలంలో కూడా వారు అదే చెప్పారని తెలుస్తోంది.

ఆ జిల్లాల కలెక్టర్లుగా ఉన్న దేవానంద్, వెంకటేషంల వాంగ్మూలాన్ని సిబిఐ సేకరించింది. తాము ఏ స్థాయిలో ఒత్తిళ్లను ఎదుర్కొన్నామో వారు వివరించారు. భాను కీలక పాత్ర పోషించినట్లుగా చెప్పారు. ఓ ప్రయివేటు ప్రాజెక్టు అమలు విషయంలో ఇంత ఒత్తిడి, ఇంత వేగం తాము ఎన్నడూ చూడలేదని వారు చెప్పారు. ఈ ప్రాజెక్టుపై 2008 జూన్ 29న నిర్వహించిన సమాశంలో దివంగత వైయస్ కూడా ఆదేశాలు జారీ చేశారని, నిర్దిష్ట గడువు పెట్టి వేగంగా పనులు జరిగేలా చూడాలని చెప్పారని దేవానంద్ వివరించినట్లుగా తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+