వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆశాభోంస్లే కూతురు వర్ష ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Twist in Varsha Bhosle's suicide case over Asha's 'lost' gun
ముంబయి: ప్రముఖ గాయని ఆశా భోంస్లే కూతురు వర్షా భోంస్లే ఆత్మహత్య కేసులో ముంబయి పోలీసులు తమ విచారణలో కొత్త ట్విస్ట్ ఫేస్ చేశారు. ఈ నెల 8న వర్షా భోంస్లే తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు పలువురిని విచారిస్తున్నారు. ఆశా తనయుడు ఆనంద్ వాంగ్మూలం పోలీసులకు కొత్త తలనొప్పి తీసుకు వచ్చింది. వర్షా ఏ తుపాకీతో అయితే తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకుందో అది 1991లోనే మిస్ అయిందట.

ఈ విషయాన్ని ఆశా తనయుడు ఆనందం పోలీసులకు శనివారం చెప్పారు. ఆనంద్‌ను పోలీసులు విచారించారు. ఆశా బెల్జియన్ మేక్ 0.6 సెలిబర్ పిస్టల్‌ను పొగొట్టుకుందని పోలీసులకు తెలిపారు. వర్ష ఏ తుపాకీతో అయితే ప్రభు కుంజ్ రెసిడెన్స్‌లోని తన నివాసంలో కాల్చుకున్నారో అదే తుపాకీ మిస్ అయిందని అతను చెప్పారు. దీంతో పోలీసులు కొత్త ట్విస్ట్‌ను ఈ కేసులో ఫేస్ చేస్తున్నారు. ఆనంద్ వాంగ్మూలం పోలీసును గందరగోలపరుస్తోంది.

అయితే ఈ పిస్టల్ ఆనంద్ పేరు మీదే రిజిస్టర్ అయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇది కూడా వారింట్లో భద్రంగా ఉన్నట్లు గుర్తించారు. ఇప్పుడు ఆనంద్ ఆ తుపాకీ మిస్ అయిందని చెప్పడంతో పోలీసులకు ఏమీ పాలుపోవట్లేదు. మరోవైపు ఆశా భోంస్లే కూడా ఆ తుపాకీ స్వంతదారు తానేనని, దానిని గతంలో పోగొట్టుకున్నానని ఓ ప్రకటనలో తెలిపారు. ఆనంద్ తన వాంగ్మూలంలో తనకు సోదరి వర్షతో ఎలాంటి విభేదాలు లేవని, ఇతర అన్నా చెల్లెల్ల వలె తమ మధ్య సాధారణ వాగ్వాదం మాత్రమే ఉండేదని చెప్పారు.

కాగా పోలీసులు అంతకుముందు ఆశా భోంస్లే సోదరి ఉషా మంగేష్కర్, వంటవాడు, డ్రైవర్‌లను విచారించారు. ఆశా భోంస్లే, ఆమె సోదరి లతా మంగేష్కర్‌ను కూడా పోలీసులు విచారించారు.

English summary
Mumbai police faced a challenging situation while investigating into the case of Varsha Bhosle's mysterious death. Varsha, daughter of singer Asha Bhosle, committed suicide by shot herself with a gun. Now, police have come to know that the pistol was missing since 1991.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X