జైల్లో ఉన్నా జనం గురించే, షర్మిల యాత్ర...: భూమన

Bhumana Karunakar Reddy
హైదరాబాద్: ప్రజాద్రోహి అయిన ప్రభుత్వంతో ప్రతిపక్ష పార్టీ కుమ్మక్కు కావడం వల్లనే తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజా ప్రస్థానం పేరిట పాదయాత్ర చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆదివారం అన్నారు. షర్మిల చేపడుతున్న యాత్ర ఒక నిరసన పాదయాత్ర భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైన రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి, అలాంటి ప్రభుత్వాన్ని అవిశ్వాసం పెట్టి పడగొట్టే అవకాశమున్నా అలా చేయకుండా నాటకాలాడుతున్న టిడిపి కుమ్మక్కు రాజకీయాలకు నిరసనగా ఈ యాత్ర చేపడుతున్నారని ఆరోపించారు.

రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, ప్రజల ఆకాంక్షలను ఏ మాత్రం తీర్చకుండా నిరంతరం ప్రజల జీవితాలతో చెలగాటమాడుతోందన్నారు. ఇలాంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వం మెడలొంచాల్సిన ప్రధాన ప్రతిపక్షం టిడిపి ఆ పార్టీతో కుమ్మక్కైందని, వైయస్ జగన్‌కు రోజురోజుకూ పెరుగుతున్న ప్రజాదరణను చూసి భయపడుతున్న టిడిపి అధికారపక్షంతో మ్యాచ్‌ఫిక్సింగ్ చేసుకుని అవిశ్వాస తీర్మానం పెట్టకుండా లాలూచీ పడుతోందని ఆరోపించారు.

ఈ అధికారపక్ష, ప్రతిపక్షాల వైఖరులపై నిరసన తెలపడంతోపాటు, ఇలాంటి సమయంలో ప్రజలకు ధైర్యం చెప్పేందుకు, భవిష్యత్తుపై భరోసా ఇచ్చేందుకు పార్టీ తరఫున ప్రజలతో మమేకం కావాలనే భావనతో జగన్ ఉన్నారని, జైల్లో ఉంటూ కూడా జగన్ నిరంతరం ప్రజల గురించే ఆలోచిస్తున్నారని చెప్పారు. ఆయన ఆదేశాల మేరకు షర్మిల ఈ యాత్రకు పూనుకున్నారన్నారు. జగన్ నేతృత్వంలో రాబోయే ప్రభుత్వంలో వైయస్ సువర్ణయుగాన్ని మళ్లీ చూడవచ్చన్నారు.

పాదయాత్ర సందర్భంగా వైయస్ అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎలాంటి హంగులు, ఆర్భాటాలు చేయొద్దని, పూలు చల్లడంలాంటి కార్యక్రమాలు అసలు వద్దని కరుణాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ముందుగా రూపొందించిన రూట్‌మ్యాప్ ప్రకారమే యాత్ర సాగుతుందని, కొద్దిగా కూడా మార్పులుండవని, ఈ విషయం స్థానిక నాయకులు గుర్తించాలని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+