మన్మోహన్‌కు తాకనున్న తెలంగాణ సెగ: జెఏసి హెచ్చరిక

రాజ్యాంగానికి తూట్లు పొడిచేలా కేంద్రం వ్యవహరిస్తోందన్నారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి కేంద్రానికి చిత్తశుద్ధి లేదని, ప్రత్యేక రాష్ట్రంపై ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరిస్తోందన్నారు. ఇందిరాపార్కు వద్ద నల్లరంగు బెలూన్లు ఎగురవేస్తామని చెప్పారు. తెలంగాణపై ఏకాభిప్రాయాన్ని కేంద్రం కోరటం రాజ్యాంగ విరుద్దమన్నారు. నవంబరు 1కి సంబంధించి కీలకమైన కార్యాచరణ రూపొందించుకున్న తర్వాతే స్టీరింగ్ కమిటీ భేటీ అవుతుందన్నారు.
మోసపూరిత వైఖరి.. హరీష్ రావు
తెలంగాణపై కాంగ్రెసు మోసపూరిత వైఖరిని నిరసిస్తూ ఇందిరా పార్కు వద్ద ధర్నా చేస్తామని సిద్దిపేట తెరాస శాసనసభ్యుడు హరీష్ రావు చెప్పారు. సమరానికి, సంబరాలకు ఎప్పుడు టిఆర్ఎస్ సిద్ధమే అన్నారు. తెలంగాణ కోసం తమ పార్టీ తరఫు చర్చలు జరుగుతాయి, అలాగే పోరాటాలూ జరుగుతాయన్నారు. చర్చలు చేస్తూనే ఉద్యమం చేస్తూ తెలంగాణ సాధించడమే తమ లక్ష్యమన్నారు.
అందుకే ఓ వైపు ఢిల్లీలో తమ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేకర రావు చర్చలు జరుపుతున్నా తాము తెలంగాణ కవాతును విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించామన్నారు. కేంద్రం తెలంగాణ ఇస్తే తీసుకుంటామని లేదంటే కాంగ్రెసును చావగొట్టి తీసుకుంటామన్నారు. తెలంగాణపై కాంగ్రెసు పార్టీ పూటకో మాట మాట్లాడటం సరికాదన్నారు. వారి ప్రవర్తన అలాగే ఉంటే ఇప్పటికే ఈ ప్రాంతంలో దిగజారిన కాంగ్రెసు పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందన్నారు.
ప్రధానికి కిషన్ రెడ్డి లేఖ
ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సోమవారం బహిరంగ లేఖ రాశారు. ఓపెన్ కాస్ట్‌తో ఉత్తర తెలంగాణ విధ్వంసమవుతుందని ఆ లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ జరుగుతున్న ఆత్మహత్యలకు మొదటి ముద్దాయి ప్రధానియే అని ఆయన ఆరోపించారు. రేపటి తెలంగాణ జెఏసి నిరసన కార్యక్రమాలకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని కిషన్ రెడ్డి తెలిపారు.
రేపు హైదరాబాద్ ప్రధాని
ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రేపు మధ్యాహ్నం హైదరాబాద్ రానున్నారు. మధ్యాహ్నం 2.45 నిమిషాలకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. 2.50కి బయోడైవర్సిటీ ప్రాంగణానికి బయలుదేరుతారు. అక్కడ 3.20కి, 4.15కి రెండు కార్యక్రమాలను ప్రారంభించి, మాట్లాడతారు. 4.30కి బేగంపేట విమానాశ్రయానికి తిరుగు ప్రయాణమవుతారు. 5.10కి బేగంపేట నుండి న్యూఢిల్లీ తిరిగి బయలుదేరుతారు.












Click it and Unblock the Notifications