బాబుతో వైయస్ మ్యాచ్ ఫిక్సింగ్ చేశారా: జగన్‌కు టిడిపి

వారానికి ఒకసారి అవిశ్వాసం పెట్టమనే జగన్ పార్టీకి దాని విలువ తెలియడం లేదన్నారు. జగన్ పార్టీకి అంతగా కిరణ్ కుమార్ రెడ్డిని పడగొట్టాలనే దృఢ సంకల్పం ఉంటే అన్ని పార్టీల మద్దతుతో గవర్నర్‌ను కలిసి తాము ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నామని చెబితే సరిపోతుందని, అప్పుడు ప్రభుత్వం పడిపోతుందని సూచించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అవిశ్వాసం పేరుతో రాజకీయం చేస్తుందని విమర్శించారు.
అవిశ్వాసమంటే అర్థం తెలియని వాళ్లు దాని గురించి మాట్లాడటం అవివేకమన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల పాదయాత్ర గురించి స్పందిస్తూ.. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాత ఆమె తన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రను చేపడితే మంచిదన్నారు. లేదంటే ప్రజలు ఆమెను నిలదీస్తారన్నారు.
కాంగ్రెసు పార్టీ వల్లే దేశంలో ఇన్ని సమస్యలు తలెత్తాయని మరో నేత రావుల చంద్రశేఖర రెడ్డి హైదరాబాదులో అన్నారు. వైయస్సార్ కాంగ్రెుస పార్టీ అనుచరులు ఇంకా కాంగ్రెసు పార్టీలో కొనసాగుతున్నారన్నారు. అవిశ్వాసం పెట్టలేదని టిడిపిపై జగన్ పార్టీ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు. అవిశ్వాసం ఎప్పుడు పెట్టాలో టిడిపికి తెలుసునన్నారు. చంద్రబాబు నాయుడు పాదయాత్రకు వస్తున్న ప్రజాధరణను చూసి ఓర్వలేక వారు తమ పార్టీ పైన విమర్శలు చేస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications