హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెస్ ప్రాణం తీస్తాం, ప్రధాని తలదించుకోవాలి: హరీష్‌

By Srinivas
|
Google Oneindia TeluguNews

Harish Rao
హైదరాబాద్: తెలంగాణ ప్రాంతం కాంగ్రెసుకు ప్రాణం పోసిందని రాష్ట్రాన్ని ప్రకటించకుంటే ప్రాణం తీస్తుందని తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు మంగళవారం అన్నారు. తెలంగాణ నగారా సమితి ఆధ్వర్యంలో ప్రధాని హైదరాబాద్ పర్యటనను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రజల భిక్షతోనే కేంద్రంలో కాంగ్రెసు పార్టీ అధికారంలో ఇన్నాళ్లు కొనసాగుతోందన్నారు.

కాంగ్రెసుకు ప్రాణం పోసిన తాము తెలంగాణ ఇవ్వమంటే ప్రాణం తీస్తామన్నారు. కాంగ్రెసు పార్టీలో ఉండి తెలంగాణ కోసం ఐక్యంగా పోరాడుతామని కాంగ్రెసు నేతలు చెబితే ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. వారు పార్టీని విడిచి బయటకు రావాలని సూచించారు. అన్నం పెట్టే చెయ్యికి కాంగ్రెసు సున్నం పెట్టే విధంగా ప్రవర్తిస్తోందన్నారు. కాంగ్రెసు పార్టీని పాతర పెట్టి అయినా సరే తెలంగాణ సాధిస్తామన్నారు.

ప్రజల సహనానికి, ఓపికకు కూడా ఓ హద్దు ఉంటుందన్నారు. తమ ప్రాంత ప్రజలు ఇప్పటి వరకు ఎంతో ఓపిక వహించారన్నారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రోడ్డు మీద కాలు పెట్టలేని పరిస్థితి వచ్చిందన్నారు. హైదరాబాదు రోడ్లపై కారులో తిరగలేని పరిస్థితి, రోడ్డుపై కాలు పెట్టలేని పరిస్థితి వచ్చినందుకు మన్మోహన్ తల దించుకోవాలన్నారు. తెలంగాణ కోసం తమ పార్టీ మడమ తిప్పని పోరాటం చేస్తుందన్నారు.

తమ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేకర రావు తెలంగాణయే తన జీవిత లక్ష్యమని ప్రకటించారన్నారు. ఆయన కొన ఊపిరి వరకు తెలంగాణ కోసం పోరాడుతారన్నారు. తెలంగాణపై కేంద్రమంత్రి వాయలార్ రవి నాన్చుడు ధోరణి ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెసు పార్టీని నమ్మొద్దని నాగం జనార్ధన్ రెడ్డి అన్నారు. కాంగ్రెసును తప్పించి అన్ని పార్టీలు తెలంగాణ కోసం ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

English summary
TRS MLA Harish Rao warned Congress party for their attitude on Telangana statehood. He suggested Telangana Congress leaders to leave party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X