హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రిజైన్లు ఇంట్లో కూర్చునేందుక్కాదు: జీవన్, బొత్సపై ఫైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jeevan Reddy
హైదరాబాద్: తెలంగాణ ప్రాంత మంత్రుల రాజీనామాలను తాము డిమాండ్ చేసేది మేం ఇంట్లో కూర్చునేందుకు కాదని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి మంగళవారం అన్నారు. తెలంగాణ కోసం మంత్రులు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే వారి రాజీనామాలు కోరేది తాము ఇంట్లో కూర్చునేందుకు కాదన్నారు. అందరం కలిసి తెలంగాణ కోసం ఉద్యమించాలన్నారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అపాయింటుమెంటు కూడా తీసుకోలేని తెలంగాణ ప్రాంత మంత్రులు రాష్ట్రాన్ని ఎలా సాధిస్తారన్నారు.

తెలంగాణ కోసం మంత్రులే రోడ్డు మ్యాప్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఓ వైపు తెలంగాణ కోసం ఉద్యమం జోరుగా సాగుతుంటే తెలంగాణపై ఎలాంటి నిర్ణయం తీసుకోని కాంగ్రెసు పార్టీ తరఫున సభ్యత్వం తీసుకోమని ఎలా అడుగుతామని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. సీమాంధ్ర మంత్రి శైలజానాథ్ సమైక్యాంధ్ర ఉద్యమం చేస్తుంటే ఈ ప్రాంత మంత్రులు తెలంగాణ ఉద్యమంలో ఎందుకు పాల్గోవడం లేదో చెప్పాలన్నారు. పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ రెండో ఎస్సార్సీ అనడం తెలంగాణ ప్రజలను మోసం చేయడమే అన్నారు.

బాబు, షర్మిల స్పష్టత ఇవ్వాలి.. యాష్కీ

తెలంగాణపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల స్పష్టత ఇవ్వాలని నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ డిమాండ్ చేశారు. వారు స్పష్టత ఇవ్వని పక్షంలో తెలంగాణలో వారి పర్యటనను తెలంగాణవాదులు అడ్డుకుంటారని హెచ్చరించారు. మరోసారి మహబూబాబాద్ పునరావృతమవుతుందన్నారు.

ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రెండో ఎస్సార్సీ అనడం సరికాదన్నారు. 2009 డిసెంబర్‌లోనే కేంద్రం తెలంగాణను ప్రకటించిందని, అలాంటప్పుడు రెండో ఎస్సార్సీ అని ఎలా అంటామన్నారు. మంత్రులు రాజీనామా చేస్తే ఖచ్చితంగా తెలంగాణ వస్తుందన్నారు. 2014 వరకు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెసు అధిష్టానంపై ఉందని, అందుకే ఈ ప్రాంత నేతలు అధిష్టానాన్ని హెచ్చరిస్తే ఖచ్చితంగా తెలంగాణ వస్తుందన్నారు.

English summary
Congress party senior leader Jeevan Reddy demanded Telangana region ministers resignation to Telangana statehood.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X