తెలంగాణ అంటే టిఆర్ఎస్‌కే ఓటు, రాష్ట్రాన్ని తెస్తా: కెకె

K Keshava Rao
హైదరాబాద్: జై తెలంగాణ అని ఎవరు అన్నా తెలంగాణ రాష్ట్ర సమితికే ఓటు పడుతుందని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు కె కేశవ రావు మంగళవారం అన్నారు. ఆయన తెలంగాణ నగారా సమితి ఆధ్యర్వంలో ఇందిరా పార్కు వద్ద నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణలోని ప్రతి వ్యక్తి మనసులో తెలంగాణ ఉందన్నారు. ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ అందరి ఆశయం తెలంగాణే అన్నారు.

తెలంగాణపై అసెంబ్లీలో తీర్మానం చేసే వరకు కాంగ్రెసు పార్టీ తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు సభకు వెళ్లవద్దని సూచించారు. తెలంగాణ కోసం అందరం కలిసి ఐక్యంగా పోరాడుదామన్నారు. తెలంగాణపై అసెంబ్లీలో తీర్మానం కోసం తెలంగాణ ఎమ్మెల్యేలు పోరాడాలన్నారు. తీర్మానం పెడితేనే సభకు వస్తామని చెబితే కేంద్రం ఖచ్చితంగా దిగి వస్తుందన్నారు. కేంద్రంపై ఒత్తిడి తెస్తేనే తెలంగాణ సాధ్యమని ఆయన చెప్పారు.

అన్ని వర్గాలు సమైక్యంగా తెలంగాణ కోసం ఉద్యమిస్తున్నాయని, ఇది ప్రజా ఉద్యమం అన్నారు. ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు సభకు వెళ్లమని చెప్పి తన చేతిలో రాజీనామా పెడితే తాను పది రోజుల్లో తెలంగాణ తీసుకు వస్తానని కెకె సవాల్ చేశారు. తెలంగాణ కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు అధిష్టానానికి లేఖలు రాయాలని సూచించారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రెండో ఎస్సార్సీ అనడం సరికాదన్నారు.

కాంగ్రెసు పార్టీకి ప్రజాస్వామ్య విలువలపై నమ్మకం లేనట్లుగా కనిపిస్తోందన్నారు. తెలంగాణ అని ఎవరు అన్నా తెరాసకే ఓట్లు పడతాయని, అలాంటి టిఆర్ఎస్ ప్రత్యేక రాష్ట్రం కోసం అందర్నీ కలుపుకు పోవాలని సూచించారు. ఎంపీలు సభ నుండి సస్పెండ్ అయినా కాంగ్రెసులో చలనం లేక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణపై కేంద్రం హామీ ఇచ్చిందని దానిని నిలుపుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+