'బొగ్గు స్కాం' ఎథేనా ఇన్‌ఫ్రాకు వైయస్ అండదండలు

వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎథేనా ఇన్‌ఫ్రాకు ఆయన పూర్తి అండదండలిచ్చారని పేర్కొంది. ఈ కంపెనీ ఆవిర్భావం వెనుక వైయస్‌కు సంబంధించిన వ్యక్తులు ఉన్నారని తెలిపింది. ఎథేనా ఇన్‌ఫ్రా ఏర్పాటు చేయడంలో పాత్ర వహించి ఐదోవంతు శాతానికి పైగా వాటాలు పొందిన సెయిన్జ్ హైడ్రోపవర్ సంస్థలో వైయస్ సోదరుడు, ఆయన అల్లుడు ముఖ్యవాటాదారులుగా ఉన్నారని తెలిపింది. ఆ తర్వాత కొంతకాలానికి వాటాలను ఇతరులకు బదిలీ చేశారని పేర్కొంది.
ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌కు చెందిన జి2 కార్పోరేట్ సర్వీసెసస్ లిమిటెడ్ సంస్థ ఎథేనా ఇన్‌ఫ్రా ఆవిర్భావంలో భాగస్వామ్యం వహించిందని, నిమ్మగడ్డ కూడా కొంతకాలం డైరెక్టర్‌గా కొనసాగారని తెలిపింది. ఎథేనా గ్రూపులోని ఈస్ట్ కోస్ట్ సంస్థకు వైయస్ సర్కారు శ్రీకాకుళం జిల్లాలో భూమిని కేటాయించిందని, బొగ్గు దిగుమతుల కోసం సముద్రంలో ప్రత్యేక జెట్టీకి అనుమతించిందని తెలిపింది.
సిక్కింలో ఎథేనా సంస్థకు 1200 మెగావాట్ల తీస్తా ఊర్జా విద్యుత్ ప్లాంటును దక్కించుకోవడం వెనుక వైయస్ పాత్ర ఉందని, సిక్కిం ప్రభుత్వం నిర్వహించిన టెండర్లలో ప్రాజెక్టును దక్కించుకునేందుకు అనేక సంస్థలు పోటీపడ్డా, ఈ రంగంలో అనుభవం లేని ఏథేనాకు ప్రాజెక్టు దక్కించుకుందని, ఇందుకోసం జెన్‌కోను అది సహ భాగస్వామిగా చూపిందని, ఇందుకోసం అవసరమైన సహకారం వైయస్ అందించారని పేర్కొంది.












Click it and Unblock the Notifications