జై తెలంగాణ అంటే ఇంట్లో కూడా పని చేస్తా: కెకె

తాను కెసిఆర్‌కు ఏజెంట్‌ను కాదన్నారు. జై తెలంగాణ అన్న ప్రతి ఒక్కరికీ ఏజెంట్‌గానే పని చేస్తానని చెప్పారు. తెలంగాణకు అనుకూలంగా ఉన్న వారి ఇంట్లో పని చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానన్నారు. తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఢిల్లీకి వెళ్లాలనే నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల ఎమ్మెల్యేలు ఢిల్లీకి వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారని చెప్పారు.
తెలంగాణ ప్రజాప్రతినిధులు ఏకమై ఢిల్లీ వెళ్లాలని ప్రజా సంఘాల జెఏసి కూడా కోరిందన్నారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కార్యక్రమానికి తెలంగాణ మీడియాను అనుమతించక పోవడంపై విచారణ జరిపించాలని కెకె డిమాండ్ చేశారు. ఢిల్లీకి వెళ్లే విషయంపై తెలంగాణ రాష్ట్ర సమితి ఇంకా నిర్ణయం తీసుకోలేదని, పార్టీలో చర్చించిన తర్వాత తమ నిర్ణయాన్ని చెబుతామని తెలిపారన్నారు. అందరు కలిసి ఢిల్లీ వెళ్లి ఒత్తిడి తీసుకు వస్తే బాగుంటుందన్నారు.












Click it and Unblock the Notifications