హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలుగులో జగన్ పార్టీ వెబ్‌సైట్: పార్టీలో చేరనున్న జిట్టా

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Vijayamma
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారిక వెబ్ సైట్‌ను ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ బుధవారం ఆవిష్కరించారు. హైదరాబాదులోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె www.ysrcongress.comను ప్రారంభించారు. ఈ వెబ్ సైట్‌ను తెలుగులో ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్ ద్వారా ఈ పార్టీలో ఎవరైనా చేరవచ్చు. రాష్ట్రంలో కొత్త పార్టీ ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందో ఇందులో పొందుపరిచారు.

కాగా వెబ్ సైట్‌ను ప్రారంభించిన అనంతరం వైయస్ విజయమ్మ మాట్లాడుతూ... పార్టీకి, ప్రజలకు ఇది అనుసంధానంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అభిమానులు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలకు ఇది ఉపయోగపడుతుందన్నారు.

జగన్ పార్టీలోకి జిట్టా

వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో తెలంగాణ యువ జెఏసి చైర్మన్ జిట్టా బాలకృష్ణా రెడ్డి చేరనున్నారు. ఆయన మంగళవారం మధ్యాహ్నం పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మను కలిశారు. ఈ నెల 29న భువనగిరిలో భారీ ఎత్తున బహిరంగ సభను ఏర్పాటు చేసి విజయమ్మ సమక్షంలో జగన్ పార్టీలో చేరుతానని జిట్టా చెప్పారు. తెలంగాణ ప్రజల మనోభావాలను తాము గౌరవిస్తున్నామని, ప్రత్యేక రాష్ట్రం ఇచ్చేది కేందమే కనుక వారు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని జగన్ పార్టీ చెప్పిందని జిట్టా అన్నారు.

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డికి తెలంగాణలోనూ అభిమానులు ఉన్నారని కెకె మహేందర్ రెడ్డి అన్నారు. పరకాల ఉప ఎన్నికలలో కొండా సురేఖకు వచ్చిన ఓట్లను బట్టి ఈ విషయం అర్థమవుతోందన్నారు. వైయస్ పథకాలు అన్నీ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పక్కన పెడుతోందని ఆరోపించారు.

English summary

 YSR Congress party honorary president YS Vijayamma was launched YSRCongress party website on Wednesday in Hyderabad party central office.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X