జగన్ పార్టీకి ముగ్గురుఅధ్యక్షులు, కుటుంబ పార్టీ: టిడిపి

అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ కోసమే కాంగ్రెసు పార్టీతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కైందన్నారు. అందుకే బొగ్గు కుంభకోణంపై, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాపై వచ్చిన ఆరోపణలపై ఆ పార్టీ మాట్లాడటం లేదన్నారు. బొగ్గు కుంభకోణంలో జగన్ పార్టీకి కూడా పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి, వైయస్ జగన్‌ల అవినీతి కొనసాగింపే షర్మిల పాదయాత్ర అన్నారు.
జగన్ బెంగళూరు, హైదరాబాదులలో ఇళ్లు, సాక్షి మీడియా, వేల ఎకరాల భూములు, వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. షర్మిల తన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో ప్రజల నుండి వీటిపై ప్రతిఘటన ఎదుర్కొంటారన్నారు. పాదయాత్రలో ప్రజలకు ఆస్తులపై చెప్పాల్సిన పరిస్థితి వస్తుందన్నారు.
అవినీతికి లైసెన్స్ కోసమే.. చంద్రబాబు
అనంతపురం: అవినీతికి లైసెన్స్ కోసమే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పుట్టుకు వచ్చిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. రాష్ట్రాన్ని దోచుకుంటున్న కాంగ్రెసును తరిమి కొట్టాలన్నారు. చంద్రబాబు తన వస్తున్నా మీకోసం పాదయాత్రను 16వ రోజు కర్నూలు జిల్లా ఘణపురం నుండి ప్రారంభించారు. ఈ రోజు ఆయన ఆదోని నియోజకవర్గంలో 19.9 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తారు.












Click it and Unblock the Notifications