ఐదుగురు మంత్రులు ఢిల్లీకి: తెలంగాణకోసం లాబియింగ్

సొంత పార్టీ పార్లమెంటు సభ్యులు తెలంగాణ కోసం ఉద్యమిస్తున్నారు. మరోవైపు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు సమైక్యాంధ్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. దీంతో మంత్రుల పైన మరింత ఒత్తిడి పడుతోంది. తమ సమస్యను అధిష్టానానికి చెప్పి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని వారు పార్టీ పెద్దలను కోరనున్నారు. తెలంగాణ కవాతు సమయంలో జరిగిన అక్రమ అరెస్టులు, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కార్యాక్రమానికి తెలంగాణ మీడియాను అనుమతించక పోవడం వంటి సంఘటనలను కూడా వారు ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకు వెళ్లనున్నారు.
తెలంగాణపై ఢిల్లీలో కూడా కదలిక వస్తుందన్న వార్తల నేపథ్యంలో ఇప్పుడు వెళ్లి లాబీయింగ్ చేస్తేనే బాగుంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. జానా రెడ్డి ఈ రోజు సాయంత్రం పార్టీ సీనియర్ నేత కె కేశవ రావుతో భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనపై చర్చించినట్లుగా తెలుస్తోంది.
ఢిల్లీ వదిలి రావొద్దు
తెలంగాణపై కేంద్రం అనుకూల ప్రకటన చేసే వరకు ఢిల్లీ వెళుతున్న మంత్రులు తిరిగి రావొద్దని తెలంగాణ నగారా సమితి చైర్మన్ నాగం జనార్ధన్ రెడ్డి అన్నారు. తెలంగాణ జర్నలిస్టుల ఆందోళనకు పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు. తెలంగాణకు ఖర్చు, అభివృద్ధిలో అన్యాయం జరుగుతోందని ఆరోపించారు.












Click it and Unblock the Notifications