నేను వైయస్‌లా ఉంటే: బాబు, 15కిమీ నడిచిన షర్మిల

వైయస్ తన పాలనలో హత్యా రాజకీయాలకు పురికొల్పారని, తాను వారిలా ఫ్యాక్షనిజం చేస్తే కాంగ్రెసు పార్టీలో ఎవరూ ఉండేవారు కాదని అన్నారు. వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం గెలుపొందటం ఖాయమని ముందుంది మంచికాలమన్నారు. కొద్ది కాలం ఓపిక పడితే సంక్షేమ పాలన అందిస్తామన్నారు. కాంగ్రెసు ప్రభుత్వం ప్రజలను పీక్కు తింటోందన్నారు. ప్రజా సంక్షేమానికి అధికార పార్టీ ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు.
మరోవైపు కడప జిల్లాలో షర్మిల పాదయాత్ర గురువారం ఇడుపులపాయ నుండి ప్రారంభమైంది. ఆమె తొలిరోజు 15 కిలోమీటర్లు నడిచారు. షర్మిలకు ప్రజలు నీరాజనాలు పలికారు. 11.45 నిమిషాలకు షర్మిల పాదయాత్ర ప్రారంభమైంది. తొలుత ట్రిపుల్ ఐటికి వెళ్లారు. అక్కడి విద్యార్థులతో ముచ్చటించారు. షర్మిల పాదయాత్ర ప్రారంభం సమయంలో సభకు భారీగా ప్రజలు హాజరు కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
షర్మిల తొలిరోజు ఇడుపులపాయ నుండి వేంపల్లె వరకు తొలిరోజు మొత్తం 15 కిలోమీటర్లు నడిచారు. షర్మిలతో పాటు వైయస్ విజయమ్మ, వైయస్ భారతి రెడ్డి, కొండా సురేఖ, శోభా నాగి రెడ్డి, రోజా, మేకపాటి చంద్రశేఖర రెడ్డి, కాపు రామచంద్రా రెడ్డి, గుర్నాథ్ రెడ్డి, గొల్ల బాబూరావు, సుజయ విజయకృష్ణ రంగారావు, వైయస్ వివేకానంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications