విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విద్వేషకారులతో కమిటీయా: రాంబాబుపై అడుసుమిల్లి

By Pratap
|
Google Oneindia TeluguNews

Cameraman Ganga Tho Rambabu
విజయవాడ/ విశాఖపట్నం: పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా వివాదంపై ప్రభుత్వం కమిటీ వేయడాన్ని మాజీ శానససభ్యుడు అడుసుమిల్లి జయప్రకాష్ వ్యతిరేకించారు. ప్రాంతీయ విద్వేషకారులతో కమిటీ ఎలా వేస్తారని ఆయన అడిగారు. కమిటీ వేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన శనివారం డిమాండ్ చేశారు.

సెన్సార్ బోర్డు చేయాల్సిన పనిని ప్రభుత్వం వేసిన కమిటీ ఎలా చేస్తుందని ఆయన అడిగారు. కమిటీని నియమించే అధికారం ప్రభుత్వానికి ఎక్కడదని ప్రశ్నించారు. సమస్య ఏదైనా ఉంటే సెన్సార్ బోర్డుకు అపీల్ చేసుకోవాల్సిందేనని ఆయన అన్నారు. కమిటీ ఏర్పాటుపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అడుసుమిల్లి జయప్రకాష్ విజయవాడ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌కు సన్నిహితులు. లగడపాటి రాజగోపాల్ ఇప్పటికే సినిమాకు తన పూర్తి మద్దతు ప్రకటించారు.

కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో వివాదాస్పద సన్నివేశాలు లేవని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస రావు అన్నారు. సినిమాపై వివాదం చెలరేగిన నేపథ్యంలో ఆయన విశాఖ విమ్యాక్స్ థియేటర్‌లో ప్రత్యేక ప్రదర్శన వేయించుకుని సినిమాను చూశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.

సినిమాలో ఎక్కడ కూడా తెలంగాణవాదులను కించపరిచే అంశాలు లేవని ఆయన అన్నారు. దనిపై లేనిపోని రాద్ధాంతం చేయడం సబబు కాదని ఆయన అన్నారు. దర్శక నిర్మాతలు, తెలంగాణ పంపిణీదారుల కార్యాలయాలపై దాడులకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. గంటా శ్రీనివాస రావు రాజ్యసభ సభ్యుడు, పవన్ కళ్యాణ్ సోదరుడు చిరంజీవికి అత్యంత సన్నిహితులు. ఆయన చిరంజీవితో పాటు ప్రజారాజ్యంలో ఉన్నారు.

English summary
Former MLA Adusumilli Jayaprakash has opposed the constitute to go into the merits and demerits of Pawan Kalyan's Cameraman Ganga Tho Rambabu film. Meanwhile, minister Ghanta Srinivas Rao has seen Cameraman Ganga Tho Rambabu film.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X