మత ప్రచారం కాదు: 'బైబిల్' రాజకీయంపై విజయమ్మ

అంత మాత్రాన తాను మత ప్రచారం చేసినట్లు కాదని ఆమె చెప్పారు. తన మతం మానవత్వమని ఆమె చెప్పారు. తాను అన్ని మతాలను గౌరవిస్తానని, ఏ మతానికి తాను వ్యతిరేకం కాదన్నారు. తన భర్త దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి మనుషులను ప్రేమించడమే తనకు నేర్పించారని చెప్పారు. తన భర్త చనిపోయి, తన కొడుకు, పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళితేనే తాను రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందన్నారు.
కాగా విజయమ్మ మత రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. గతంలో కరీంనగర్ జిల్లా సిరిసిల్ల చేనేత దీక్షకు కూడా ఆమె బైబిల్ తీసుకు వెళ్లడంపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. తెలుగుదేశం పార్టీ దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల షర్మిల యాత్ర సమయంలోనూ విజయమ్మ బైబిల్‌తో కనిపించారు. దీనిపై విమర్శలు రావడంతో ఆమె స్పందించారు.












Click it and Unblock the Notifications