తెలుగును అవమానిస్తే స్కూళ్ల తాట తీస్తా: మండలి

Mandali Buddha Prasad warns Schools
హైదరాబాద్: తెలుగును అవమానిస్తే పాఠశాలల అంతు చూస్తానని అధికార భాషా సంఘం నూతన అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ హెచ్చరించారు. అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా ఆయన గురువారం ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రంలో తెలుగు భాషను గౌరవించని ప్రైవేట్ విద్యాసంస్థలను సహంచేది లేదని ఆయన అన్నారు. తెలుగు భాషను గౌరవించని విద్యాసంస్థలకు రాష్ట్రంలో స్థానం లేదని ఆయన అన్నారు. తెలుగు భాషకు గౌరవం ఇవ్వని విద్యాసంస్థలు మూతపడే వరకు విశ్రమించబోనని అన్నారు. అటువంటి విద్యాసంస్థల అంతం చూసేవరకు నిద్రపోనని మండలి బుద్ధప్రసాద్ అన్నారు.

తెలుగు భాషకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసే విధంగా చొరవ చూపుతానని హామీ ఇచ్చారు.ట వచ్చే ప్రపంచ తెలుగు మహాసభల్లో ఈ మేరకు ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకునే విధంగా కృషి చేస్తానని ఆయన అన్నారు. మండలి బుద్ధప్రసాద్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి తదితరులు హాజరయ్యారు.

తెలుగు భాష పట్ల ఉన్న మక్కువ కారణంగానే మండలి బుద్ధప్రసాద్‌కు అధికార భాషా సంఘం చైర్మన్ పదవి ఇవ్వాలని కాంగ్రెసు అధిష్టానం నిర్ణయించిందని వారు చెప్పారు. మండలి బుద్ధప్రసాద్ కుటుంబానికి, తమ కుటుంబానికి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని చిరంజీవి నెమరేసుకున్నారు. తెలుగు భాష పట్ల మండలి బుద్ధప్రసాద్‌కు ఎనలేని మక్కువ అని ఆయన అన్నారు.

మండలి బుద్ధప్రసాద్ నేతృత్వంలో అధికార భాషా సంఘం తెలుగు వికాసానికి కృషి చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్‌ను నియమిస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వులు తెలుగు భాషలోనే వెలువడడం విశేషం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+