రౌడీయిజం,దోపీడీ: షర్మిల రాజన్నరాజ్యంపై గాలి కౌంటర్

ఇప్పటికే కాంగ్రెసు పార్టీ రాష్ట్రాన్ని ఆగాథం చేసిందని ఆరోపించారు. తన సోదరుడు వైయస్ జగన్ కోసం పాదయాత్ర చేస్తున్న షర్మిలకు ప్రజా సమస్యలు తెలుసుకుందామని, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీద్దామనే ఆలోచన ఏమాత్రం లేదన్నారు. జగన్ గురించి చెబుతూ తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైనే విమర్శలు గుప్పిస్తున్నారన్నారు. వైయస్ జలయజ్ఞం పేరుతో కోట్లు దండుకొని ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదన్నారు.
షర్మిల ప్రజా సమస్యలపై పోరాటం చేయడం లేదన్నారు. తన పాదయాత్రలో ఆమె అధికార పార్టీని వదిలి చంద్రబాబు నాయుడును విమర్శించడమేమిటని ప్రశ్నించారు. షర్మిల పాదయాత్రను ప్రజలు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. అన్నకు అధికారం కోసమే ఆమె పాదయాత్ర చేస్తున్నారన్నారు.
అవసరమైతే కోర్టుకు.. యనమల
చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్ జగన్ ములాకత్‌ల విషయంలో అధికారులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని, వివరాలు కావాలని సమాచార హక్కు చట్టం కింద తాను దరఖాస్తు చేసుకున్నానని, వివరాలు ఇవ్వని పక్షంలో తాను కోర్టుకు కూడా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని టిడిపి నేత యనమల రామకృష్ణుడు వేరుగా అన్నారు. జగన్ జైలుకెళ్లినప్పటి నుండి అతనిని ఎంతమందిని కలిశారో సమాచారం ఇవ్వాలన్నారు.












Click it and Unblock the Notifications