షర్మిల పాదయాత్ర: వైయస్ స్టయిల్లోనా, ఇలా..
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాదయాత్రకు విరుగుడుగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన సోదరి షర్మిలను రంగంలోకి దింపారు. ఆమె సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. తన పాదయాత్రలో వివిధ పద్ధతుల్లో ప్రజల మనసును దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

కమీజు, కుర్తా ధరించి, పాదాలకు బూట్లు తొడిగి ఆమె నడక సాగిస్తున్నారు. రంగు రంగుల దుస్తుల్లో ఆమె పాదయాత్రలో కొట్టిచ్చినట్లు కనిపిస్తున్నారు.

షర్మిల తన పాదయాత్రలో పెద్దలను కూడా ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తన తండ్రి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, పింఛను పథకాల వల్ల లభించే వృద్ధుల ఆదరణను సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. పాదయాత్రలో వైయస్‌ను కలిసిన ఓ వృద్ధుడు షర్మిల చెంతకు వచ్చి కలిశాడు.

షర్మిల పాదయాత్రకు మహిళల నుంచి పెద్ద యెత్తున ఆదరణ లభిస్తుందని భావిస్తున్నారు. గ్రామీణ మహిళలు ఇలా షర్మిలను పలకరిస్తున్నారు. షర్మిల నేను మీ కోసమే వచ్చాననే పద్ధతిలో ముచ్చటిస్తున్నారు.

తన పాదయాత్రలో తల్లుల చంకల్లో కేరింతలు కొడుతున్న పిల్లలను ఇలా తన చేతుల్లోకి తీసుకుని వారిని ముద్దు చేస్తున్నారు షర్మిల. ఇటువంటి దృశ్యాలు తరుచుగా ఆమె పాదయాత్రలో కనిపిస్తున్నాయి.

మహిళలు షర్మిలను ఇలా చుట్టుముడుతున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి కూతురిగా ఆమెకు ఉన్న ఇమేజ్ ఇలా మహిళలను ఆమెకు దగ్గర చేస్తున్నాయి. ఇది వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఏ మేరకు ఉపయోగపడుతుందో చూడాలి.
వైయస్ జగన్ జైలులో ఉండడంతో, ఆయనకు సమీప కాలంలో బెయిల్ లభించే అవకాశాలు లేకపోవడంతో అనివార్యంగా షర్మిల రాజకీయాల్లో కాలు పెట్టాల్సి వచ్చారు. చంద్రబాబుకు దీటుగా నడక సాగించాల్సిన అనివార్యతలో పడ్డారు. జగన్‌ను ఎందుకు జైల్లో పెట్టారో చెప్పాలని కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు ప్రశ్నిస్తుంటే, ఆ రెండు పార్టీల కుట్ర వల్లనే తన సోదరుడు జైల్లో ఉన్నాడంటూ విరుచుకుపడుతున్నారు. ఏమైనా, రాష్ట్ర రాజకీయాలకు ఓ కొత్త నేత షర్మిల రూపంలో పుట్టుకొచ్చారు.












Click it and Unblock the Notifications