తెలంగాణమార్చ్‌లో పాల్గొన్న రాజిరెడ్డి మృతి: నివాళులు

రాజిరెడ్డికి కెపిహెచ్‌బిలో అంత్యక్రియలు జరుగుతున్నాయి. అంతిమయాత్రకు భారీగా తెలంగాణవాదులు తరలి వచ్చారు. అమరవీరులకు, తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేశారు. రాజిరెడ్డి మృతికి డిజిపి దినేష్ రెడ్డియే కారణమని తెలంగాణ రాష్ట్ర సమితి ఆరోపించింది. తెలంగాణ కవాతులో కాల్పులు జరపాలని డిజిపియే పోలీసులపై ఒత్తిడి తెచ్చారని, ఆయనపై హత్యా నేరం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
కాగా గత నెల 30వ తేదిన నెక్లెస్ రోడ్డులో తెలంగాణ కవాతు జరిగిన విషయం తెలిసిందే. ఆ రోజు ఆందోళనకారులను నియంత్రించేందుకు సచివాలయం, ఖైరతాబాద్, నెక్లెస్ రోడ్డు ప్రాంతాల్లో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. ఆ సమయంలో రాజిరెడ్డి నెక్లెస్ రోడ్డులోనే ఉన్నారు. బాష్పవవాయువును పీల్చి అస్వస్థతకు గురైన రాజిరెడ్డిని ప్రాథమిక చికిత్స నిమిత్తం మెడిసిటీ ఆసుపత్రికి తరలించారు.
ఆయన చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు మరణించారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. తమకు సమాచారం అందించలేదని కిషన్ రెడ్డి, కోదండరామ్ రాత్రి ఆందోళన చేశారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని తార్నాకలో కోదండను, బర్కత్‌పురలో కిషన్ రెడ్డిని విడిచిపెట్టారు. రాజిరెడ్డిది కరీంనగర్ జిల్లా రామగుండం వద్ద పెద్దమ్మపేట.












Click it and Unblock the Notifications