సురేఖకు బాలినేని వెల్‌కం: విత్తనాలు వేసిన షర్మిల

సినిమా వాళ్ల డైరెక్షన్‌లో చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేయడం సిగ్గు చేటు అన్నారు. ఆంధ్రాలో పోటీ చేస్తే స్వాగతిస్తామన్న బాలినేని వ్యాఖ్యలపై సురేఖ స్పందించారు. వచ్చే ఎన్నికల్లో తాను పరకాల నుండే పోటీ చేసి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెసు నేతలకు దోచుకోవడం తప్ప ప్రజా సమస్యలు పట్టడం లేదని మండిపడ్డారు. చంద్రబాబు పాదయాత్ర పేరుతో దొంగజపం చేస్తున్నారని విమర్శించారు.
విత్తానాలు వేసిన షర్మిల
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల శుక్రవారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు తన పాదయాత్రను ప్రారంభించారు. మల్లేనిపల్లి, ధర్మవరం మీదుగా ఆమె పాదయాత్ర సాగింది. ధర్మవరంలో ఓ రైతు విత్తనాలు వేయమని కోరడంతో షర్మిల పొలంలో విత్తనాలు జల్లారు. అనంతరం ఆమె మాట్లాడారు.
రాజన్న పాలనకు, ఇప్పటి ప్రభుత్వ పాలనకు తేడా అందరూ గమనిస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు, కాంగ్రెసుల కుమ్మక్కు రాజకీయాలు ప్రజలు అందరూ గమనిస్తున్నారన్నారు. వారిద్దరు కలిసి తన సోదరుడిని జైలుకు పంపించారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications