ఎప్పుడో చెప్పాం, దెబ్బ తీసేందుకే..: తెలంగాణపై బాబు

Chandrababu Naidu
మహబూబ్‌నగర్: తెలంగాణపై తమ వైఖరిని ఎప్పుడో చెప్పామని, తమ పార్టీని దెబ్బ తీయడానికే తెలంగాణ విషయంలో కాంగ్రెసు తమను లక్ష్యం చేసుకుంటోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రాబాబు నాయుడు అన్నారు. తమ పార్టీ తెలంగాణకు ఎప్పుడూ వ్యతిరేకం కాదని అన్నారు. తాను తెలంగాణకు వ్యతిరేకంగా ఏ రోజు కూడా మాట్లాడలేదని చంద్రబాబు గుర్తు చేశారు. తెలంగాణపై అఖిలపక్షం ఏర్పాటు చేస్తామని చెప్పినా కేంద్రం ఇంతవరకు ఎందుకు పెట్టలేదని చంద్రబాబు ప్రశ్నించారు.

చంద్రబాబునాయుడు 'వస్తున్నా...మీకోసం' పాదయాత్ర శుక్రవారం నాటికి 25వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా బూడిదపాలెంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీని దెబ్బతీసేందుకే కాంగ్రెస్ పార్టీ కుట్రపన్నుతోందని, అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), వైయస్సార్ కాంగ్రెసు పార్టీలను కలుపుకునేందుకు యత్నిస్తోందని ఆయన ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు తగిన విధంగా బుద్ధి చెప్పాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు.

తాము అధికారంలోకి వస్తే చదువుకున్నవారందరికీ ఉద్యోగం, ఉపాధి లభించేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. అమరవాయిలో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ ఆ హామీ ఇచ్చారు. అవినీతి పాలనను రూపుమాపితేనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. బిసీలు, దళితులకు సామాజిక, రాజకీయ న్యాయం చేస్తామని చెప్పారు. అమరవాయిలో బాలకృష్ణ చంద్రబాబును కలిశారు.

శుక్రవారం ఉదయం మహబూబ్‌నగర్ జిల్లాలోని అమరవాయి నుంచి చంద్రబాబు పాదయాత్రను ప్రారంభించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 22వ తేదీన ప్రవేశించింది. అప్పటి నుంచి ప్రతి సందర్భంలోనూ ఆయన తెలంగాణ గురించి మాట్లాడుతూనే ఉన్నారు. తాము తెలంగాణకు వ్యతిరేకం కాదని పదే పదే చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+