మీడియాపై రివర్స్ స్టింగ్: వందకోట్లపై జీ టివిXజిందాల్

బొగ్గు బ్లాకుల కేటాయింపునకు సంబంధించిన కథనాలు ప్రసారం కాకుండా ఉండేందుకు రూ.100 కోట్లు ఇవ్వాలని అడిగారని, జీ న్యూస్ ప్రతినిధులు తమను ఢిల్లీలో కలిసిన సందర్భంలో రివర్స్ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించామని నవీన్ జిందాల్ తెలిపారు.
వేలం నిర్వహించకుండా చేసిన బొగ్గు బ్లాకుల కేటాయింపుల్లో జిందాల్‌కు చెందిన జిందాల్ పవర్ అండ్ స్టీల్ లిమిటెడ్ కూడా లబ్ధి పొందినట్లు కాగ్ తన నివేదికలో పేర్కొంది. అయితే జిందాల్ ఆరోపణలను జి న్యూస్ ఖండించింది. బొగ్గు కుంభకోణంలో ఆ కంపెనీ పాత్రను తాము బహిర్గతం చేయడంతో సదరు సంస్థ భయపడిందని, అందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తోందన్నారు.
జిందాల్ విడుదల చేసిన సిడిని తాము ఖండిస్తున్నట్లు చెప్పారు. తమ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ఇలాంటి కుట్రలు చేస్తున్నారని, జిందాల్ వైఖరిని బట్టబయలు చేయడంలో తమ ఛానల్ ఎప్పుడూ ముందుందని అందుకే ఇలా ఆరోపణలు చేస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications