వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షర్మిల యాత్ర: వైయస్ అవినీతి చెప్పాల్సిందే... విహెచ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

V Hanumantha Rao
హైదరాబాద్: దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన భూకేటాయింపులపై విచారణ జరిపించాలని, ఆ వివరాలతో ఓ శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు శనివారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కోరారు. వైయస్ హయాంలో ఎలాంటి తప్పు జరగలేదని షర్మిల తన పాదయాత్రలో చెబుతున్నారని, ఇలాంటి సమయంలో వైయస్ అక్రమాలను తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.

జగన్, షర్మిల, విజయమ్మలు ఓ వైపు నీతులు చెబుతూ, మరోవైపు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని తిడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలోనే 2004 నుంచి 2009 వరకు జరిగిన అక్రమ భూకేటాయింపులపై విచారణ జరిపించాలన్నారు. సోనియాపై విమర్శలు గుప్పిస్తున్నా కాంగ్రెస్ ముఖ్యనేతలు మౌనం దాల్చడంపై సరికాదన్నారు.

ముఖ్యమంత్రి ఎదురుదాడికి సిద్ధం కావాలని విహెచ్ సూచించారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ వాతావరణం పరిశీలిస్తుంటే.. ఎన్నికలు మరెంతో దూరంలో లేవని అనిపిస్తోందని విహెచ్ అభిప్రాయపడ్డారు. 2014 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతల అసలు రంగును ప్రజలకు వివరించాలంటే 2004 నుంచి 2009 వరకూ జరిగిన భూ కేటాయింపులపై సమగ్ర విచారణ జరిపించాల్సిందే అన్నారు. వాన్‌పిక్ విచారణతో వైయస్ హయాంలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయని పేర్కొన్నారు.

English summary

 Congress party senior leader V Hanumantha Rao has appealed CM Kiran Kumar Reddy to release late YS Rajasekhar Reddy's regime land allotments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X