విజయమ్మతో భేటీ, జగన్ పార్టీలోకి మరో ఎమ్మెల్యే

Naddala Rajesh
హైదరాబాద్: పశ్చిమ గోదావరి జిల్లాలో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు గండి పడుతూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బలం పుంజుకుంటోంది. జిల్లాలోని మరో శానససభ్యుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నారు. తెలుగుదేశం పార్టీ శానససభ్యురాలు వనిత వైయస్సార్ కాంగ్రెసులో చేరాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారు. తాజాగా, కాంగ్రెసు చింతలపూడి శాసనసభ్యుడు మద్దాల రాజేష్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నారు.

రాజేష్ సోమవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మను కలిశారు. త్వరలో తన శాసనసభ సభ్యత్వానికి, కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసి వైయస్సార్ కాంగ్రెసులో చేరడానికి ఆయన సిద్ధపడ్డారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో తాను కార్యకర్తగా పని చేస్తానని ఆయన చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి వల్లనే తాను శాసనసభ్యుడిగా విజయం సాధించానని ఆయన విజయమ్మతో భేటీ తర్వాత మీడియాతో చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి వల్లనే తన నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందని ఆయన చెప్పుకున్నారు.

ఇదిలావుంటే, విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట తెలుగుదేశం మాజీ శానససభ్యుడు చెంగల వెంకట్రావు సోమవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ సమక్షంలో ఆయన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. చెంగల వెంకట్రావుకు పార్టీ కండువా వేసి విజయమ్మ తన పార్టీలోకి ఆయనను ఆహ్వానించారు.

ఇదిలావుంటే, గత ఎన్నికల్లో రాజేష్‌పై పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన తెలుగుదేశం పార్టీ నాయకుడు కర్రా రాజారావు కూడా వచ్చే నెల 4వ తేదీన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరనున్నారు. కొవ్వూరులో జరిగే బహిరంగ సభలో వైయస్ విజయమ్మ సమక్షంలో ఆయన పార్టీలో చేరనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+