వైయస్ జగన్ వల్లే అన్ని మంత్రి పదవులు: మేకపాటి

Mekapati Rajamohan Reddy
అనంతపురం/ హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ప్రభంజనం వల్లనే కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో రాష్ట్రాన్నికి ఎక్కువ పదవులు ఇచ్చారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. జైపాల్ రెడ్డి శాఖను మార్చడం అప్రజాస్వామికమని ఆయన అన్నారు. షర్మిల పాదయాత్రలో పాల్గొన్న ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర మరో ప్రజా ప్రభంజనమని ఆయన అన్నారు. షర్మిల పాదయాత్రకు వేలాది మంది స్వచ్ఛందంగా తరలి వస్తున్నట్లు ఆయన తెలిపారు. షర్మిల పాదయాత్రలో సోమవారం పలువురు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డితో పాటు శానససభ్యులు గర్నాథ రెడ్డి, కాపు రామచంద్రా రెడ్డి, మేకపాటి చంద్రశేఖర రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, నేతలు తోపుదుర్తి కవిత, జిల్లా కన్వీర్ శంకర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలోని ప్రధాన సమస్యలను పక్కదారి పట్టించేందుకే కేంద్రంలో యుపిఎ ప్రభుత్వం మంత్రి వర్గ విస్తరణను చేపట్టిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్సి కె. నారాయణ అన్నారు. రాష్ట్రానికి సింహభాగం కేటాయించే పేరుతో రాష్ట్రంలోని సమస్యలను కాంగ్రెసు పక్కదారి పట్టిస్తోందని ఆయన సోమవారం హైదరాబాదులో అన్నారు.

ఒకవైపు ప్రత్యేక రాష్ట్ర సమస్య రోజురోజుకీ జఠిలమవుతున్నా పట్టించుకోకుండా మంత్రివర్గ విస్తరణ చేపట్టడం ద్వారా రాష్ట్రంలోని సమస్యల పరిష్కారంపై కేంద్రం చూపుతున్న అశ్రద్ధ అర్థమవుతోందని ఆయన అన్నారు. తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేయకుండా ప్రజా సమస్యలపై పోరాడి ఉంటే చిరంజీవికి మరింత మంచి పేరు వచ్చి ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+