జగన్ పార్టీకి టాకింగ్ డాల్: షర్మిలపై రఘువీరా

వచ్చే ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు ఏడాదిన్నర ముందుగా పాదయాత్రలు చేపట్టడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీని ప్రజలు నమ్మనందున మీకోసం.. అంటూ చంద్రబాబు పాదయాత్ర చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆరోవిడత భూపంపిణీ కార్యక్రమాన్ని వచ్చే నెల 3వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు మంత్రి మంత్రి తెలిపారు. అనంతపురం జిల్లా హిందూపురంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి దీన్ని ప్రారంభిస్తారని చెప్పారు. మొత్తం లక్ష ఎకరాల భూమిని పంపిణీ చేయాలని లక్ష్యం గా పెట్టుకున్నట్లు తెలిపారు. ఒంగోలులో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవడానికి స్పెషల్‌డ్రైవ్ చేపట్టనున్నట్లు చెప్పారు. భూభారతి కింద నిజామాబాద్ జిల్లాను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశామన్నారు. అనంతరం రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఈ స్కీంను వర్తింపజేస్తామన్నారు. రెవెన్యూ శాఖలో 25 ఏళ్ల తర్వాత పోస్టుల భర్తీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు.
రాష్ట్రంలో 400 సర్వేయర్ పోస్టులను భర్తీ చేసినట్లు మంత్రి ఎన్ రఘువీరారెడ్డి తెలిపారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వీటిని భర్తీ చేశామన్నారు. కొత్త సర్వేయర్లు శిక్షణ పొందుతున్నట్లు గురువారం రాత్రి మీడియా ప్రతినిధులతో అన్నారు.












Click it and Unblock the Notifications