రాష్ట్రంలో భూప్రకంపనలు: భయంతో జనం పరుగులు

అందిన సమాచారం ప్రకారం - నల్లగొండ జిల్లాలోని మిర్యాలగుడా, మేళ్లచెర్వు, దామచర్ల, హాలియా, మఠంపల్లి మండలాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. పది మండలాల్లో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. గుంటూరు జిల్లాలోని వినుకొండ, పిడుగురాళ్ల, కారంపూడి, గురజాల, సత్తెనపల్లి తదితర ప్రాంతాల్లో భూమి కంపించింది.
ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, మార్కాపురం, ఎర్రగొండపాలెం, సంతనూతలపాడు, అద్దంకి, దర్శి, మార్టూరు ప్రాంతాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. జిల్లాలోని మూడు శాసనసభా నియోజకవర్గాల్లో భూప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి.
కృష్ణా జిల్లాలోని నందిగామ, జగ్గయ్యపేట, కంచికచర్ల, ముక్యాల, వేదాద్రి ప్రాంతాల్లో భూమి కంపించింది. ఖమ్మం జిల్లాలోని మధితర, సత్తుపల్లి ప్రాంతాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రంగారెడ్డి జిల్లాను కూడా ప్రకంపనలు తాకాయి. ఈ జిల్లాలోని హయత్‌నగర్, కొత్తగూడెం మండలాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
నల్లగొండ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో గోడలకు బీటలు వారినట్లు తెలుస్తోంది. సిమెంట్ ఫ్యాక్టరీలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో భూప్రంకపనలు చోటు చేసుకున్నాయి. ఆరు నెలల కాలంలో ప్రకంపనలు చోటు చేసుకోవడం ఇది రెండోసారి. ఈసారి గతంలో కన్నా ఎక్కువ తీవ్రతతో ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. సుమిత్రా దీవిలో చోటు చేసుకున్న ప్రకంపనలు కూడా రాష్ట్రంలోని ప్రకంపనలకు కారణం కావచ్చునని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications