తప్పిన నీలం తుఫాను గండం: మేలేనన్న రఘువీరా

నీలం తుఫానుపై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరా రెడ్డి బుధవారం సాయంత్రం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ తుఫాను వల్ల రాష్ట్రానికి మేలే జరిగిందని ఆయన అన్నారు. రాష్ట్రంలోని 61 మండలాల్లో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఆయన తెలిపారు. తుపాను వల్ల ఏ విధమైన ముప్పు లేదని చెప్పారు.
తుఫాను ప్రభావంతో ఇప్పటి వరకు కురిసిన వర్షాల వల్ల రైతులకు, రాష్ట్రానికి మేలు జరుగుతుందని రఘువీరా రెడ్డి అన్నారు. తుఫాను సహాయక చర్యల్లో భాగంగా 47 మంది జాతీయ విపత్తు స్పందన బృంద సభ్యులను నెల్లూరుకు పంపినట్లు తెలిపారు. చిత్తూరు, నెల్లుూరు జిల్లాల్లో గతంలో పనిచేసిన సీనియర్ ఐఎఎస్ అధికారులను ప్రత్యేక అధికారులుగా పంపించినట్లు ఆయన తెలిపారు.
రవిచంద్రన్‌ను చిత్తూరు జిల్లాకు, రాజశేఖర్‌ను నెల్లూరు జిల్లాకు, వల్లవన్‌ను ప్రకాశం జిల్లాకు ప్రత్యేక అధికారులుగా నియమించినట్లు రఘువీరా రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎలాంటి పంట నష్టం జరగలేదని చెప్పారు.
నీలం తుఫాను వల్ల తమిళనాడులోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. చెన్నై నగరంలోని పలు పల్లపు ప్రాంతాల్లో వరద నీరు చేరింది. దాన్ని తోడివేసేందుకు జనరేటర్లు వాడుతున్నారు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications