విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బ్యాంకాక్ తీసుకెళ్లి యువకుడి కిడ్నాప్: ముఠా అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

 gang arrested for kidnapping
విశాఖపట్నం: ఆస్ట్రేలియన్ నౌకలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి విశాఖపట్నానికి చెందిన ఓ యువకుడిని బ్యాంకాక్ తీసుకువెళ్లి అతడిని కిడ్నాప్ చేసిన ముఠాను పోలీసులు పట్టుకున్నారు. బాధితుడిని వారి నుంచి కాపాడారు. గత ఆగస్టులో జరిగిన ఈ కిడ్నాప్ వ్యవహారంలో పోలీసులు నిందితులను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వివరాలను విశాఖ నగర పోలీస్ కమిషనర్ పూర్ణచంద్రరావు మీడియా ప్రతినిధుల సమావేశంలో వెల్లడించారు.

పూర్ణచంద్రరావు చెప్పిన వివరాల ప్రకారం - బిహెచ్‌పివిలో పనిచేస్తున్న కె హనుమంతరావు తన కుమారుడు శ్రీనివాస్‌ను బిజినెస్ మేనేజ్‌మెంట్ చదివించారు. విదేశాల్లో ఉద్యోగం కోసం కమీషన్ ఏజెంట్ తనకు సీనియర్ అయిన గొట్టిపాటి మన్మథను ఉద్యోగం కోసం ఆశ్రయించి రష్యా వెళ్లి మోసపోయాడు. తిరిగి వచ్చాక మన్మథను నిలదీసి ఎక్కడైనా ఉద్యోగం ఇప్పించాల్సిందేనని వత్తిడి చేశాడు. దీంతో మన్మథ, ఆస్ట్రేలియన్ షిప్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని, నెలకు 96,000 రూపాయల జీతం ఇస్తారని నమ్మించాడు.

బ్యాంకాక్‌లోని ఓవర్సీస్ బిజ్ గ్రూప్‌నకు చెందిన జిమ్మి గుప్త ఈ ఉద్యోగాన్ని ఇప్పిస్తాడని చెప్పటంతో ఆగస్ట్ 28న శ్రీనివాస్ బ్యాంకాక్ బయల్దేరి వెళ్లాడు. అక్కడ ఎయిర్‌పోర్టులో అతడిని జిమ్మి గుప్త రిసీవ్ చేసుకున్నాడు. గుప్త వెంటనే శ్రీనివాస్‌కు వీసా ఏర్పాటు చేశాడు. ఆ వీసా చూసిన వెంటనే శ్రీనివాస్‌కు అనుమానం వచ్చింది. అది కేవలం టూరిస్ట్ వీసాగా శ్రీనివాస్ గుర్తించాడు. వెంటనే గుప్తను ప్రశ్నించాడు. తమ మోసాన్ని అతడు గుర్తించాడని తెలుసుకున్న గుప్తా ముఠా శ్రీనివాస్‌ను కిడ్నాప్ చేసి ఓ గదిలో బంధించారు.

శ్రీనివాస్‌ను కిడ్నాప్ చేశామని, 25 వేల డాలర్లు (సుమారు 13.5 లక్షల రూపాయలు) ఇస్తే వదిలిపెడతామంటూ అతని తండ్రి హనుమంతరావుకు ఫోన్‌లు చేయడం ప్రారంభించారు. ప్రతి అరగంటకోసారి ఫోన్ చేసి బెదిరించడంతో హనుమంతరావు ముందు లక్షా 30 వేల రూపాయలు గాజువాకలోని ఓ బ్యాంక్ ద్వారా ఎస్.మహేశ్వరి పేరిట ఉన్న ఖాతాలో చెన్నైలోని అభిలాష్ ఇల్లంగోవా అనే వ్యక్తి ఆదేశాల మేరకు వేశారు. ఈ మొత్తం సదరు ఖాతాలోకి చేరగానే, కిడ్నాపర్లు మళ్లీ ఫోన్ చేసి, మిగిలిన 12 లక్షలను వెంటనే పంపించాల్సిందిగా హెచ్చరించారు.

దీంతో హనుమంతరావు గత నెల 4న గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. విశాఖ పోలీసులు బ్యాంకాక్‌లోని ఇండియన్ ఎంబసీతోను, ఢిల్లీలోని ఇంటర్‌పోల్ పోలీసులు స్వయంగా వెళ్లి కలిశారు. థాయ్ పోలీసులు కూడా రంగంలోకి దిగారు. హనుమంతరావుతో మాట్లాడిన మాటలను రికార్డు చేశారు. వాటిని నగర పోలీస్ కమిషనర్ ఇంటర్నెట్ ద్వారా థాయ్ పోలీసులకు పంపించారు. శ్రీనివాస్ బ్యాంకాక్‌లో ఒక ప్రాంతంలో ఉన్నట్టు థాయ్ పోలీసులు గుర్తించి అక్కడికి చేరుకున్నారు. వారు లేరు. తిరిగి 6రాత్రి కిడ్నాపర్లు పడుకున్న సమయంలో శ్రీనివాస్ వారి సెల్ ఫోన్ తీసుకుని, తను ఎక్కడ ఉన్నదీ తండ్రికి తెలియచేశాడు.

థాయ్ పోలీసులు దాడి చేసి కిడ్నాపర్లు శివకుమార్ అలియాస్ జిమ్మి గుప్త (27), బబ్లూ శర్మ (30), పీయూష్ థాంకి (32), రామోథి ఇత్‌మిసర్ (36) చెరలో ఉన్న శ్రీనివాస్‌ను విడిపించి, ఇండియన్ ఎంబసీకి సురక్షితంగా చేర్చారు.

English summary

 A gang was arrested by Visakhapatnam police for kidnapping an youth taking him to Bangkok. Kidanappers Sivakumar and other four were arrested in Thailand.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X