పొగడ్తలకే సరిపోయింది, తింటే తెలిసేది: హరీష్ రావు

Harish Rao
హైదరాబాద్: ఇందిర బాట పేరుతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేపట్టిన మెదక్ జిల్లా పర్యటన కేవలం పొగడ్తలకే సరిపోయిందని తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు గురువారం అన్నారు. ఆయన తెలంగాణ భవనంలో మధ్యాహ్నం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ అరెస్టు అక్రమం అన్నారు. అక్రమ అరెస్టులతో తెలంగాణవాదులను ఆపాలని చూడటం విడ్డూరంగా ఉందన్నారు.

తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోరుతుంటే అన్ని ప్రాంతాల ప్రజల అంగీకారం కోరతామనడం సమంజసం కాదన్నారు. యుకెలో స్కాట్లాండు ప్రజలు ప్రత్యేక దేశం కోసం డిమాండ్ చేస్తే 2014లో కేవలం స్కాట్లాండులోనే రెఫరెండం నిర్వహిస్తాని యుకె ప్రభుత్వం చెప్పిందని తెలిపారు. తెలంగాణ కోసం యుకెను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ప్రత్యేక రాష్ట్రం కావాలనే వారి అభిప్రాయాలు మాత్రమే తీసుకోవాలన్నారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రెండు కళ్ల సిద్ధాంతంతో ముందుకు వెళుతూ ఇరు ప్రాంతాల ప్రజలు, తన పార్టీ ఎమ్మెల్యేలు, నాయకుల విశ్వాసాన్ని కోల్పోతున్నారన్నారు. చంద్రబాబు కాళ్లతో కాకుండా మోకాళ్లపై యాత్ర చేసినా ఎవరూ నమ్మే స్థితిలో లేరన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అవతరణ వేడుకలు జరపడం తెలంగాణకు వ్యతిరేకం అన్నారు. చంద్రబాబు లేఖలో స్పష్టంత లేదని బొజ్జల గోపాల కృష్ణ రెడ్డి అన్నారని, దీనిపై మోత్కుపల్లి నర్సింహు, ఎర్రబెల్లి దయాకర రావు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇందిర బాటలో కిరణ్ సమస్యలు పట్టించుకోవడం లేదని, పొగడ్తలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. తెలంగాణలో అణిచివేత ధోరణి కొనసాగుతోందన్నారు. రాజ్యంగ హక్కును ప్రభుత్వం కాలరాస్తోందన్నారు. అవతరణ వేడుకలను ప్రజలు స్వచ్చంధంగా బహిష్కరించారన్నారు. తెలంగాణ కోసం కలిసి వచ్చే వారితో కలిసి ఉద్యమిస్తాన్నారు. ఒక గ్రిడ్ వల్ల కరెంట్ కోతలని ముఖ్యమంత్రి అంటున్నారని కానీ, ముందు చూపు లేకపోవడం వల్లనే రాష్ట్రంలో కోతలు వచ్చాయన్నారు. మెదక్ జిల్లా ఇందిర బాట కార్యక్రమం రాజకీయ సభగా మారిపోయిందన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులతో కలిసి కూర్చొని భోజనం చేస్తే వారి కష్టాలు తెలిసేవన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+