సుప్రీంకోర్టు గడువు చెప్పలేదు: జగన్ కేసుపై సిబిఐ జెడి

2013 ఆగస్టు 31లోపు దాఖలు చేయాలంటూ సుప్రీం గడువు విధించలేదన్నారు. రాష్ట్రంలో జరిగిన పలు అవినీతి కేసులకు సంబంధించిన ఛార్జీషీట్లు ఓ కొలిక్కి వచ్చాయన్నారు. జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులో ఛార్జీషీట్ గడువు మార్చి ఆఖరు అనే విషయం పత్రికల్లో మాత్రమే వచ్చిందని, సుప్రీం కోర్టు ఉత్తర్వుల్లో ఎక్కడా లేదన్నారు. కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు అలీఖాన్ విచారణ పూర్తయినందున ఆ వివరాలను ఛార్జీషీటులో పొందుపరుస్తామన్నారు.
ఇంకా కొత్త విషయాలు బయటపడితే జోడిస్తామన్నారు. ఓఎంసి కేసులో ఇంకా దర్యాఫ్తు పూర్తి కాలేదన్నారు. వాన్ పిక్‌కు సంబంధించి త్వరలో అనుబంధ ఛార్జీషీట్ వేయనున్నట్లు చెప్పారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ భూమి విషయంలో మంత్రి గల్లా అరుణ కుమారి తనయుడు గల్లా జయదేవ్ వైపు నుంచి జరిగిన వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామన్నారు. జయదేవ్ పేరును ఛార్జీషీట్లో పేర్కొనమని, చర్య తీసుకోవాల్సింది ఎపిఐఐసి అన్నారు.
ప్రభుత్వ రంగ సంస్థల్లో అవినీతి నిర్మూలనకు సిబిఐ శక్తివంచన లేకుండా కృషి చేస్తోందని, అయితే ప్రతి ఒక్కరూ తగిన సమాచారం అందించి సహకరించాలని లక్ష్మీ నారాయణ అన్నారు. సంస్థల కొనుగోళ్ల టెండర్ల ప్రక్రియలో సమూలమైన మార్పులు వచ్చాయని, అయినప్పటికీ ప్రజా ధనం దుర్వినియోగం కాకుండా చూసేందుకు ఇంకా చాలా చేయాల్సి ఉందన్నారు.












Click it and Unblock the Notifications