ఏది నిజం?: జగన్‌పై కిరణ్, పదవులపై వైయస్సార్సీ

Harish Rao-Kiran Kumar Reddy-YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం జూలు విదిల్చారు! మరోవైపు రాష్ట్రానికి పదవుల పంట తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పుణ్యమేనని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు చెబుతున్నారు. ఇంకోవైపు తెరాసలోకి ఎంట్రీ లేని వారే జగన్ పార్టీలోకి వెళ్తున్నారని సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు అంటున్నారు.

ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూనే తమను తాము మాత్రం సమర్థించుకుంటున్నారు. బుధవారం మెదక్ జిల్లా ఇందిరమ్మ బాటలో ముఖ్యమంత్రి జగన్ పైన తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. జగన్ జైలుకు వెళ్లాడో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ లేదా ఆయన సోదరి షర్మిల సమాధానం చెబుతారా అని కిరణ్ ప్రశ్నించారు. జగన్ రైతులు, మహిళల కోసమో, ఎస్సీ, ఎస్టీల కోసమో పోరాడి జైలుకెళ్లారా అని ప్రశ్నించారు.

వేల కోట్లు ఎలా వచ్చాయో మొదట చెప్పాలని కిరణ్ నిలదీశారు. అధికారంలో లేకుండానే వేలకోట్లు దోచుకున్న వ్యక్తిని నేతగా ఎలా ఎన్నుకుంటామని ప్రశ్నించారు. కిరణ్ ఒక్కసారిగా జగన్ పైన తీవ్రస్థాయిలో మండిపడటం అందర్నీ ఆశ్యర్యపరిచింది. ఆయన జగన్ పైన అడపాదడపా విమర్శలు చేస్తూనే ఉన్నారు. కానీ బుధవారం మరింత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కిరణ్ విమర్శలు రాజకీయ వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.

జగన్ అవినీతిపై కిరణ్‌లా ఎదురుదాడికి దిగితేనే 2014లో పార్టీని గట్టెక్కించగలమని పార్టీలోని పలువురు అభిప్రాయపడుతున్నారు. జగన్ అవినీతిని కాంగ్రెసు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డితో లింక్ పెట్టకుండా చెప్పాల్సిందేనని సూచిస్తున్నారట. కిరణ్ బాగానే మాట్లాడారనే వ్యాఖ్యలు పార్టీలో వినిపిస్తుంటే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మాత్రం జగన్ జైలుకు ఎందుకు వెళ్లారో తెలియదా.. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ కుట్ర కారణంగానే ఆయన జైలుకు వెళ్లారని కిరణ్‌కు సమాధానమిచ్చింది.

కర్నూలు జిల్లా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి రాష్ట్రానికి మంత్రి పదవులు జగన్ పుణ్యమే అని అన్నారు. కాంగ్రెసు పార్టీ అధిష్టానం కూడా 2014లో తెలంగాణ, జగన్‌ను ఎదుర్కోవడానికే రాష్ట్రానికి మరో ఐదు పదవులు ఎక్కువగా ఇచ్చారనే వార్తలు వస్తున్న విషయమే. తెలంగాణలో అధికంగా ఉన్న లంబాడీలు, మాదిగలను ఆకర్షించేందుకు బలరాం నాయక్, సర్వే సత్యనారాయణలకు పదవి కట్టబెట్టింది.

రాయలసీమలో వైయస్ జగన్‌ను ధీటుగా ఎదుర్కొనేందుకు కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డికి మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో అవకాశం ఇచ్చింది. మరోవైపు తమ పార్టీలోకి ఎంట్రీ లేని వారే జగన్ పార్టీలో చేరుతున్నారని హరీష్ రావు చెబుతున్నారు. ఆయన వ్యాఖ్యలకు అర్థం లేదని అంటున్నారు. గతంలో పార్టీలో ఉండి అసంతృప్తికి లోనైన వారే జగన్ పార్టీలో చేరుతున్న వారిలో ఎక్కువ మంది ఉన్నారు.

సిరిసిల్ల నియోజకవర్గంలో కెకె మహేందర్ రెడ్డికి కెసిఆర్ తన తనయుడి కోసం 2009లో మొండిచేయి చూపారనే వాదనలు ఉన్నాయి. దాంతో అతను జగన్‌కు జై కొట్టారు. వరంగల్ జిల్లాలో కొమ్మూరి ప్రతాప్ రెడ్డి వంటి వారిని తీసుకున్నా అదే అర్థమవుతుందంటున్నారు. టిఆర్ఎస్‌లోకి ఎంట్రీ లేకపోవడం కాదని, కెసిఆర్ పట్ల అసంతృప్తితో ఉన్న వారు మాత్రమే జగన్ పార్టీలోకి వెళుతున్నారని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+