తెలంగాణ అంటే జగన్ ఎమ్మెల్యేల్ని కొంటున్నారు: బాబు

Chandrababu Naidu
మహబూబ్‌నగర్: తాను తెలంగాణపై మాట్లాడితే సీమాంధ్ర ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులను కొందరు కొంటున్నారని ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గురువారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి అన్నారు. బాబు దేవరకద్ర నియోజకవర్గంలో 32వ రోజు వస్తున్నా మీకోసం పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

తాను తెలంగాణపై మాట్లాడితే అక్కడ నేతలను కొంటున్నారన్నారు. తెలంగాణపై తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితిలు అధికారంలో ఉన్న వాళ్లని వదిలేసి మాపై విమర్శలు చేయడమేమిటని ఆయన ప్రశ్నించారు. తెలంగాణపై తాను ఎప్పుడో స్పష్టమైన ప్రకటన చేశానని చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జాక్ పాట్ సిఎం అన్నారు. సీల్డు కవర్ సిఎంకు ప్రజా సమస్యలు ఎలా తెలుస్తాయన్నారు.

కిరణ్ పత్తితో తులాభారం వేసుకుంటున్నారని, కానీ ప్రజలకు మాత్రం ఆయన పాలన తలాభారంగా మారిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెసు పార్టీతో మిగతా పార్టీలు లాలూచీ పడి టిడిపిని దెబ్బతీయాలని చూస్తున్నాయని అన్నారు. తాను ప్రజల కష్టాలు తెలుసుకునేందుకే వచ్చానని, ప్రతి ఇంటికి పెద్ద దిక్కును అవుతానని, మీ కష్టాలు తీరుస్తానని అన్నారు. ఇక్కడ ప్రజలు కష్టాలు ఎదుర్కొంటుంటే హైదరాబాదులో కూర్చొని మాట్లాడటం సబబు కాదన్నారు.

తాము అధికారంలో ఉన్నప్పుడు తక్కువ ఆదాయంతోనే అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించామని, వాటినే కొనసాగిస్తున్న కాంగ్రెసు సర్కారు ప్రస్తుతం చేసిందేమీ లేదన్నారు. రైతుల కోసం విద్యుత్ సమస్యల్ని కూడా సత్వరమే పరిష్కరించిందన్నారు. జగన్ ఘన కార్యం చేసి జైలుకు వెళ్లలేదని, అడ్డగోలు పనులు చేయడంతో సిబిఐ ఆయనను జైలుకు పంపించిందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+