చంద్రబాబు లేఖ గురించి తెలియదు: తెలంగాణపై షిండే

తెలంగాణపై చర్చలు కొనసాగుతున్నాయన్నారు. ఎప్పటిలోగా చర్చలు పూర్తవుతాయో ఖచ్చితంగా చెప్పలేమన్నారు. పరిష్కార మార్గాలు వెతుకుతున్నామని, సమస్య పరిష్కారమయ్యే వరకు చర్చలు కొనసాగుతాయని చెప్పారు. తెలంగాణపై ఎవరి సలహాలైనా తీసుకుంటామన్నారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాసిన లేఖ గురించి తనకు తెలియదన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన తమ పార్టీ పార్లమెంటు సభ్యులు తనను వచ్చి కలిశారని, తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని కోరారని చెప్పారు. కాగా తెలంగాణపై కేంద్రం ఇటీవల జోరుగా చర్చలు జరుపుతున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications